తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అన్నదే ప్రధాన నినాదంగా వినిపించింది.

ముఖ్యంగా, తెలంగాణ వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయమైన వాటా లభించాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాల్సిందేనని నాయకులూ, ఉద్యమకారులూ చెబుతూ వచ్చారు.

తెలంగాణ ప్రజలకు రావాల్సిన ప్రభుత్వోద్యోగాలను ఆంధ్ర ప్రాంతం వారు తీసేసుకుంటున్నారన్న ఆరోపణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రధాన అస్త్రం అయింది. కానీ, రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఆందోళన అలాగే కొనసాగుతోంది.

టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి విడత పాలనలో ఉస్మానియాలో ఆందోళనలు జరిగాయి. లక్షల్లో ఉద్యోగాలు అన్న మాట ఊరించి, ఉసూరుమనించి వేలల్లో ఉద్యోగాల కోసం వేవేల ఎదరుచూపులుగా అయిపోయింది.

తాజాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 50 వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు కేసీఆర్ జూలై రెండో వారంలో ప్రకటించారు. జోనల్ వ్యవస్థకు ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా అన్నారు.

ఇంతకీ ఇప్పటివరకు తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇంకా ఎన్ని ఇస్తారు?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి