Shaakuntalam Movie Review

Shaakuntalam Review: యశోద తరువాత, సమంత మల్లి ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం శాకుంతలం తో మన ముందుకొచ్చింది. అయితే ఈ చిత్రం చాల సార్లు పోస్ట్ పోనే చేయడం జరిగింది, దానికి ప్రధాన కారణం గుణశేఖర్ ఈ చిత్రాన్ని 3D లోకి కన్వర్ట్ చేయాలనీ నిర్ణయించు కున్నారు, దీంతో ప్రేక్షకుల మధ్య చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని ఒక ఉత్సుకత మొదలైంది, ఇక సమంత కూడా సినిమాని తన బుజాల మీద వేసుకుని ప్రమోట్ చేసింది, దీంతో చిత్రం మీద మంచి హైప్ అయితే క్రియేట్ అయింది, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమా చూడదగినదా కదా తెలుసుకున్న.

Shaakuntalam Movie Review

కథ

కాళిదాసు రాసిన కథ ఆధారంగా రుపొంచిన ఈ చిత్రం, శకుంతల జీవితాన్ని, తాను ఎదుర్కున్న సమస్యలని వివరిస్తుంది. శకుంతల (సమంత ) కాన్వ మహర్షి (మోహన్ బాబు ) ఆశ్రమంలో పెరుగుతుంది, అయితే ఈ శకుంతల విశ్వా మిత్రునికి మరియు మేనకకి జన్మించిన కూతురు. ఒకరోజు దుశ్యంతుడిని (దేవ్ మోహన్ ) ని చూసి ఇష్టపడుతుంది మరియు దుశ్యంతుడు కూడా శకుంతలని ఇష్టపడతాడు, ఒకానొక సమయంలో ఇద్దరికీ పెళ్లి కూడా జరుగుతుంది, ఇది తెలుసుకున్న కన్వ మహర్షి, శకుంతలని శపిస్తాడు, అది ఎలాగంటే శకుంతల ప్రేమించిన దుశ్యంతుడు తనని మర్చిపోతాడని , నిజంగానే తను మర్చిపోతాడు కూడా, ఇక చేసేదేమి లేక శకుంతల తన భర్తని వెతుక్కుంటూ వెళ్తుంది, చివరికి ఎం జరిగింది అనేది మీరు చిత్రం చూసి తెల్సుసుకోవాలి.

 శాకుంతలం మూవీ నటీనటులు

సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ, సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, డా.ఎం మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిషు సేన్‌గుప్తా తదితరులు నటించిన ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు, శేఖర్ వి జోసెఫ్ ఛాయాగ్రహణం అందిచగా , మణిశర్మ సంగీతం సమకూర్చారు, గుణ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు మరియు దిల్ రాజు ప్రెసెంట్ చేసారు.

సినిమా పేరు  శాకుంతలం
దర్శకుడు గుణశేఖర్
నటీనటులు సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ, సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, డా.ఎం మోహన్ బాబు,తదితరులు
నిర్మాతలు నీలిమ గుణ
సంగీతం మణిశర్మ
సినిమాటోగ్రఫీ శేఖర్ వి జోసెఫ్
ఓటీటీ రిలీజ్ డేట్ ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ధ్రువీకరించలేదు

 శాకుంతలం సినిమా ఎలా ఉందంటే?

శాకుంతలం చిత్రం ప్రారంభం నుంచే మంచి విజువల్స్ తో 3D లో ప్రేక్షకులని కట్టిపడేస్తుంది, కథ బాగున్నా తీసేవిధానం సరిగా లేకపోవడంతో కాసేపటికే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. సినిమా మొత్తం లో కొన్ని ఎంగేజ్ చేసే సన్నివేశాలు ఉన్నప్పటికీ, VFX మరియు నటి నటుల సొంత దుబ్బింగ్ వాళ్ళ ఏదో అనువాద చిత్రం చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అక్కడక్కడా మంచి సన్నివేశాలు ఉన్నప్పటికీ, అన్ని రకాల ప్రేక్షకులని ఎంగేజ్ చేయకపోవొచ్చు.

సమంత తన పాత్రకి న్యాయం చేసింది, చిన్న చిన్న హావభావాలు చాల బాగా పలికించింది, అయితే ఈ పాత్రకి తను అంతగా సూట్ అవ్వలేదని కూడా అనిపిస్తుంది. ఇక మలయాళ నటుడు దేవ్ మోహన్, దుశ్యంతుడి పాత్రలో పర్వాలేదు కానీ నటించడానికి అవకాశం ఉన్న తను నిరూపించుకోలేక పోయాడు, ఇక మోహన్ బాబు నటనకి పేరు పెట్టడానికి లేదు ఎం లేదు. మిగిలిన నటి నటులు తమ పాత్రల మేరకు బాగా చేసారు.

ఒక్కడు లాంటి కమర్షిల్ చిత్రం తో మంచి హిట్ కొట్టిన గుణ శేఖర్, ఈ హిస్టారికల్ వైపు ఎందుకు వెళ్ళాడో తెలీదు, ఇలాంటి కథలని తెరపైఆవిష్కరించాలంటే చాల డబ్బు తో కూడుకున్న పని, రుద్రమ దేవి కూడా బడ్జెట్ పరిమితుల వళ్ళ VFX పేలవంగా ఉంటుంది, ఇక దీంట్లో కొంచెం పర్వాలేదు, కానీ కథనం ఇంకా బాగా ఎంగేజింగ్ గా తీయాల్సింది.

సంకేతింకంగా శాకుంతలం పర్వాలేదు, మణిశర్మ సంగీతం పర్వాలేదు, శేఖర్ వి జోసెఫ్ ఛాయాగ్రహణం చిత్రానికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు .

చివరగా, శాకుంతలం ఒక్కసారి చూడొచ్చు, కానీ ఇది అన్ని రకాల ప్రేక్షకులకి కష్టమే.

ప్లస్ పాయింట్లు:

  • ఛాయాగ్రహణం
  • సమంత
  • కొన్ని ౩డ్ విజువల్స్

మైనస్ పాయింట్లు:

  •  స్క్రీన్ ప్లే
  • ఉహించదగిన కథనం

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *