Kalyanam KamaneeyamTelugu Review:పెద్ద సినిమాలు ఉన్న ఈ సంక్రాంతి రేసులో సంతోష్ శోభన్ ఈ తరం ప్రేమకథతో ‘కళ్యాణం కమనీయం’తో వస్తున్నాడు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ విడుదల తరువాత కొంత బజ్ అయితే సృష్టించింది మరియు చాలా మంది యువత ట్రైలర్లో మేకర్స్ చూపించిన పాయింట్‌కి కనెక్ట్ అయ్యారు కూడా . అయితే, ఆలస్యం చేయకుండా, లోతైన సమీక్షలోకి వెళ్లి, సినిమా చూడదగినదా కాదా అని తెలుసుకుందాం.
కథ
ఉద్యోగం లేని శివ (సంతోష్ శోబన్) తన తల్లిదండ్రుల డబ్బుతో తన బ్యాచిలర్ జీవితాన్ని ఆనందిస్తూ ఉంటాడు అయితే ఒకరోజు అతను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే శ్రుతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో పడతాడు వెంటనే పెద్దల అంగీకారంతో వారు పెళ్లి చేసుకుంటారు మరియు ఇప్పటికీ, శివ తన జీవితాన్ని మునుపటిలా ఆనందిస్తూ ఉంటాడు, శృతి అతనికి ఆర్థికంగాసహాయం చేస్తూ ఉంటుంది అయితే అంత సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో, శ్రుతి శివను ఉద్యోగం చేయమని కోరినప్పుడు కథ మలుపు తిరుగుతుంది. చివరగా, ఉద్యోగం సంపాదించడానికి ఒక్క టాలెంట్ లేని శివ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు? వారి వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యలు ఏమిటి? వారి వివాహ సంబంధాన్ని ఎలా కాపాడుకున్నారు అనేది సినిమాలో చూసి తెల్సుకోవాలి.
కళ్యాణం కమనీయం మూవీ నటీనటులు
సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్, కేదార్ శంకర్, దేవి ప్రసాద్, సప్తగిరి, సద్దాం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం అనిల్ కుమార్ ఆళ్ల, ఛాయాగ్రహణం కార్తీక్ ఘట్టంనేని, సంగీతం శ్రవణ్ భరద్వాజ్, యువి కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా పేరు | కళ్యాణం కమనీయం |
దర్శకుడు | అనిల్ కుమార్ ఆళ్ల |
నటీనటులు | సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్, కేదార్ శంకర్, దేవి ప్రసాద్, సప్తగిరి, సద్దాం |
నిర్మాతలు | యువి కాన్సెప్ట్స్ |
సంగీతం | శ్రవణ్ భరద్వాజ్ |
సినిమాటోగ్రఫీ | కార్తీక్ ఘట్టంనేని |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
కళ్యాణం కమనీయం సినిమా ఎలా ఉందంటే?
చిత్రం ఇంట్రెస్టింగ్ గా ప్రారంభమవుతుంది మరియు ఎక్కువ సమయం వృధా చేయకుండా పాత్రల పరిచయంతో అసలు కథలోకి ప్రవేశిస్తుంది. చిత్రం యొక్క బెస్ట్ పాయింట్ ఏంటంటే ఈ తరం వివాహ సమస్యల గురించి ఉండటం, మొదటి సగం ప్రారంభంలో నత్త నడకతో కూడిన కథనం ఉన్నప్పటికీ, వారు పెళ్లి చేసుకున్న తర్వాత సరైన మొత్తంలో డ్రామా, మరియు కామెడీతో మొదటి సగం ఆకర్షణీయంగా ఉంటుంది మరియు ఇంటర్వెల్ బ్లాక్‌తో రెండవ భాగం చూడటానికి ఆసక్తిని కలిగిస్తుంది.
సెకండాఫ్‌లో ఎమోషనల్ యాంగిల్‌ని చూడొచ్చు, ఫస్ట్ హాఫ్ లానే కామెడీని ఉంచుతూనే , సెకండాఫ్ కథ ప్రధానంగా ఎమోషన్స్‌తో నడుస్తుంది. పెళ్లయిన తర్వాత కూడా భర్తకు ఉద్యోగం లేకపోవడం మరియు భార్య అతనిని ఉద్యోగం చేయాలని కోరుకోవడం మరియు దాని వాళ్ళ వసీజే గొడవలు దీంతో ఇద్దరూ పరిస్థితీ ఎలా ఉన్న తమ బంధాన్ని ఎలాగైన కాపాడుకోవడం, ఈ అంశాలన్నీ చాలా రెలాటబల్ ఉంటాయి మరియు సినిమా అంతటా మీ దృష్టిని ఆకర్షిస్థాయి.సినిమా అంతటా అక్కడక్కడా కొన్ని సార్లు బోర్ అనిపించినా మంచి హాస్యం సినిమాను ట్రాక్‌లో ఉంచుతాయి.
శివగా సంతోష్ శోభన్ అద్భుతంగా నటించాడు, ప్రియా భవానీ శంకర్ ఈ సినిమాతో తెలుగులో రంగప్రవేశం చేసింది మరియు శృతిగా ఆమె బాగా చేసింది కానీ ఎమోషనల్ సీన్స్‌లో పూర్తిగా విఫలమైంది. కేదార్ శంకర్, దేవీప్రసాద్, సద్దాం, సప్తగిరి బాగా చేశారు.
ఈ తరం ప్రేమకథను, సమకాలీన అంశాన్ని చక్కటి హాస్యంతో అందించి అనిల్ కుమార్ ఆళ్ల చక్కటి పనిచేశారు. అతను వివాహం గురించి కొన్ని సామాజిక అంశాలని చక్కగా ప్రస్తావించాడు మరియు ఈ రోజుల్లో చాలా రిలేట్ అయ్యే పాయింట్ వివాహం తర్వాత ఉద్యోగం లేకపోవడం లాంటివి అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు.
సాంకేతికంగా, కళ్యాణం కమనీయం బాగుంది, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ సినిమాని రిచ్‌గా అనిపించేలా చేసింది, అతని ఫ్రేమింగ్, లైటింగ్ మరియు మూడ్ మనల్ని కథలోకి లాగి దానిలో భాగం చేస్తాయి, మరియు మిగిలిన సాంకేతిక బృందం బాగా చేసింది.
మొత్తంమీద, కళ్యాణం ఈ తరం వివాహ బంధంలో ఎదురయ్యే సమస్యలతో కూడిన ప్రేమకథ.
ప్లస్ పాయింట్లు:
- కథనం
- హాస్యం
- కొన్ని పాయింట్లు
మైనస్ పాయింట్లు:
- సింపుల్ స్టోరీ
- ఎమోషన్ లోపిస్తుంది
- ఊహించదగిన సన్నివేశాలు
సినిమా రేటింగ్: 2.5/5
ఇవి కూడా చుడండి: