
ఈ రోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా Google Meet పని చేయడం ఆగిపోయింది. చాలామంది ఉద్యోగులు, స్టూడెంట్లు మీటింగ్స్ జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే “Can’t join call”, “Connecting…” అనే errors వచ్చాయి. దీంతో వర్క్ ఫ్రం హోం మీటింగ్స్, ఆన్‌లైన్ క్లాస్‌లు, ఇంటర్వ్యూలు కూడా ఆగిపోయాయి.
DownDetector అనే వెబ్‌సైట్ ప్రకారం, దాదాపు వెయ్యికి పైగా యూజర్లు ఒకేసారి సమస్యలను రిపోర్ట్ చేశారు. అందుకే సోషల్ మీడియా లో Google Meet గురించి చర్చలు మొదలయ్యాయి.
ట్విట్టర్ / X, ఇంస్టాగ్రామ్ లో చాలా మంది ఇలా పోస్టులు పెట్టారు:
“కాల్ జాయిన్ అవ్వడం లేదు, నా బాస్ ఏం అంటాడో భయం!”
“గూగుల్ Meet డౌన్… కార్పొరేట్ వరల్డ్ fine?”
“ఆన్లైన్ క్లాస్ మధ్యలో ఆగిపోయింది… ఏమి చెయ్యాలి?”
ఇంకొంతమంది తమ ఫ్రస్ట్రేషన్ memes, trolls రూపంలో చూపించారు.
ఇప్పుడు చాలా కంపెనీలు వర్క్ ఫ్రొం హోమ్ మీద ఆధారపడి ఉన్నాయి. వీడియో మీటింగ్స్ లేకుండా పని ముందుకు సాగదు.Google Meet డౌన్ అవ్వడం వల్ల ఆఫీస్ మీటింగ్స్ కాన్సెల్ అయ్యాయి, ప్రాజెక్ట్ updates డిలే అయ్యాయి, ఆన్లైన్ క్లాస్ లు ఆగిపోయాయి, ఇంటర్వూస్, ట్రైనింగ్ కాల్స్ కూడా స్టక్ అయ్యాయి.
ఒక్క అప్ డౌన్ అవ్వడంతో: Work-From-Home పూర్తిగా డిస్టర్బ్ అయింది, ప్రొడక్టివిటీ తగ్గింది, Corporate & education రెండూ ప్రభావితం అయ్యాయి. ఇది ఒక వేక్-అప్ కాల్, టెక్నాలజీ convenient అయినా, backup ఉండాలి.