Black Friday 2025 India

ఇటీవలి కాలంలో బ్లాక్ ఫ్రైడే అనే షాపింగ్ ఫెస్టివల్ భారతదేశంలో చాలా పాపులర్ అవుతోంది. ముందు ఇది అమెరికాలో Thanksgiving తర్వాత వచ్చే పెద్ద సేల్-డే.

కానీ ఇప్పుడు ఇండియాలో కూడా దీపావళి, న్యూ ఇయర్ లా ఓ ప్రత్యేకమైన షాపింగ్ రోజుగా మారిపోయింది.

మొబైల్స్, Laptops, TVs, Earbuds, Smartwatches మీద పెద్ద తగ్గింపులు, ఫాషన్, బ్యూటీ, షూస్, Home appliances, Toys మీద కూడా బంపర్ ఆఫర్లు ఉంటాయి ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ లో.

అమెజాన్, Flipkart, Myntra, Ajio, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ అందరూ భారీ ఆఫర్లతో ముందుకు వచ్చారు. ఇంట్లోనే కూర్చొని మొబైల్‌లో షాపింగ్ చేసే సౌకర్యం

ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, Influencer రివ్యూస్, డీల్ అలర్ట్స్, ఇవన్నీ చాలా మందిని మరింత ఆకర్షిస్తున్నాయి.

పండగల తర్వాత, సంవత్సరాంతానికి ముందు చౌకగా వస్తువులు కొనడానికి ఇదే మంచి టైమ్. ఈ బ్లాక్ ఫ్రైడే రాకతో భారతీయుల షాపింగ్ అలవాట్లు కూడా మారుతున్నాయి.

ముందు ప్రజలు దీపావళి సేల్ కోసం మాత్రమే ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే + సైబర్ మండే + క్రిస్మస్ + న్యూ ఇయర్ వరుసగా, ఒక నెలన్నర పూర్తిగా షాపింగ్ ఫెస్టివల్ జరుగుతోంది. అందుకే దీన్ని చాలామంది “న్యూ ఇయర్ షాపింగ్ సీజన్” అంటున్నారు.

బ్లాక్ ఫ్రైడే ఇప్పుడు ఇండియాలో ఒక పెద్ద షాపింగ్ మూమెంట్‌గా మారింది. భారీ తగ్గింపులు, బ్రాండ్ ఆఫర్లు, సోషల్ మీడియా ప్రచారం, ఇవన్నీ కలిపి భారతీయ షాపర్లకు ఒక పెద్ద పండుగల్లా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *