
భారత రూపాయి విలువ ప్రస్తుతం చాలా ఒత్తిడిలో ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 90 రూపాయల స్థాయికి చేరుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే, రూపాయి విలువ ఇంకా పడిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
RBI (రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా) రంగంలోకి దిగకపోతే, రూపాయి 90 కంటే దిగువకు కూడా పడిపోవచ్చు. అందుకే ప్రస్తుతం మార్కెట్‌లో పెద్ద టెన్షన్ కొనసాగుతోంది.
విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడం, పెద్ద కంపెనీలు భారత మార్కెట్ నుండి డబ్బు తీసుకోవడం, దిగుమతులు పెరగడం వల్ల దేశం డాలర్లను ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అమెరికా డాలర్ బలపడటం తో ప్రపంచంలో ఇతర కరెన్సీలు కూడా పడిపోతున్నాయి. ఈ కారణాల వలన రూపాయిపై భారీ ఒత్తిడి పెరిగింది.
గతంలో, రూపాయి పడిపోతున్నప్పుడు RBI డాలర్లు విక్రయించి మార్కెట్‌ను సమతుల్యం చేసింది. కానీ ఇప్పుడు పెట్టుబడుల ప్రవాహం బలహీనంగా ఉండడంతో, RBI ఎంతవరకు జోక్యం చేసుకుంటుందో అనేది ముఖ్యంగా మారింది.
RBI జోక్యం లేకపోతే రూపాయి 91 – 92 రూపాయల వరకు పడిపోవచ్చు. స్టాక్ మార్కెట్ & వ్యాపారాలపై ప్రభావం పడుతుంది, ప్రజలు, వ్యాపారాలపై ప్రభావం కూడా ఉంటుంది, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయి.
అంతే కాకుండా విదేశాల నుండి వచ్చే వస్తువులు, ఎలక్ట్రానిక్స్ ధరలు పెరుగుతాయి, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఖర్చు ఎక్కువ అవుతుంది, విదేశీ ప్రయాణాల ఖర్చు పెరుగుతుంది.
ప్రస్తుతం రూపాయి విలువ ప్రమాదకర స్థాయిలో ఉంది. RBI ఆర్థిక చర్యలు తీసుకుంటే పరిస్థితి కాస్త మెరుగవచ్చు, లేకుంటే రూపాయి విలువ ఇంకా పడిపోవచ్చు.