Right to Disconnect Bill

ఉద్యోగులు ఆఫీస్ అవర్స్‌కి బయట పనిచేయాలని కంపెనీలు ఒత్తిడి చేసే పరిస్థితులను తగ్గించడానికి కొత్తగా ప్రవేశపెట్టిన Right to Disconnect Bill ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ కొత్త బిల్లు ప్రకారం, ఉద్యోగులకు పని సమయం ముగిసిన తర్వాత వర్క్ కాల్స్, మెసేజులతో ఇబ్బంది పెట్టకూడదని నిబంధనలు ప్రవేశపెట్టబోతున్నారు.

ఈ బిల్లులో ముఖ్య ఉద్దేశ్యం ఉద్యోగుల వ్యక్తిగత జీవితం & మానసిక ఆరోగ్యాన్ని రక్షించడం, పని ఒత్తిడి తగ్గించడం, మరియు వర్క్-లైఫ్ బాలెన్స్‌ను మెరుగుపరచడం.

ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రొం హోమ్, హైబ్రిడ్ షిఫ్ట్‌లు, డెడ్లైన్ ప్రెషర్ కారణంగా 24/7 అందుబాటులో ఉండాల్సిన బాధ్యతను ఎదుర్కొంటున్నారు.
దీని వల్ల మానసిక ఒత్తిడి పెరగడం, వ్యక్తిగత జీవితం దెబ్బతినడం, ఆరోగ్య సమస్యలు, తలెత్తుతున్నాయి.

ఈ కొత్త బిల్లు ఉద్యోగులకు మనశ్శాంతి, సమతౌల్య జీవనం, ఉత్పాదకత పెరుగుదల
అనే ప్రయోజనాలను అందిస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం “పని ఎప్పటికీ పూర్తి అవ్వదు, కానీ ఉద్యోగి జీవితాన్ని రక్షించడం ముఖ్యమైనది.” ఈ చట్టం ఉద్యోగి-నియోజకుడి మధ్య సమతౌల్యాన్ని ఏర్పరుస్తుందని చెబుతున్నారు.

Right to Disconnect Bill ఉద్యోగ ప్రపంచం మారుతున్న దిశలో కీలక మలుపు. Work-Life Balance ని ప్రాధాన్యంగా చూసే కొత్త తరానికి ఇది చాలా సహాయకరంగా మారబోతోంది. పని ముగిసిన తర్వాత ఉద్యోగం కాదు, మనశ్శాంతి మరియు కుటుంబం ముఖ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *