Starlink India Pricing Was a Glitch

Elon Musk కంపెనీ Starlink ఇండియాలో సర్వీస్ ప్రారంభించడానికి రెడీ అవుతుంది. కానీ ఇటీవల Starlink India వెబ్‌సైట్‌లో కొన్ని ధరల వివరాలు కనిపించాయి.

ఆ ధరలు చూసి చాలా మంది షాక్ అయ్యారు. నెలకు ₹8,600 మరియు డిష్ / రౌటర్ హార్డ్‌వేర్ కోసం ₹34,000 అని చూపించబడింది.

అయితే వెంటనే Starlink టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇవన్నీ నిజమైన ధరలు కావు, ఇవి కేవలం “డమ్మి టెస్ట్ డేటా”, అంటే తప్పుగా చూపించిన టెస్ట్ సమాచారం మాత్రమే అని చెప్పారు.
ఈ తప్పు ఒక టెక్నికల్ గ్లిచ్ వల్ల చూపించబడిందని చెప్పారు.

Indiaలో Starlink సర్వీస్ ఇంకా అధికారికంగా లాంచ్ కాలేదు. అసలైన టారిఫ్ / ప్రైస్ ప్లాన్లు ఇంకా ప్రకటించలేదు. భారత ప్రభుత్వ అనుమతులు ఇంకా పూర్తవ్వాలి. ధరలు మరియు ప్లాన్ వివరాలు త్వరలో ప్రకటిస్తామని కంపెనీ చెప్పింది.

ఈ Starlink ఉపగ్రహం (Satellite) ద్వారా ఇంటర్నెట్ అందిస్తుంది. దూర ప్రాంతాల్లో, గ్రామాల్లో, సిగ్నల్ లేని చోట కూడా పనిచేస్తుంది, broadband అందని ప్రాంతాలకు ఇది పెద్ద సాయంగా ఉంటుంది.

Starlink India ప్రైస్ లీక్ నిజం కాదు అని కంపెనీ క్లియర్‌గా చెప్పింది. అసలైన టారిఫ్ ప్లాన్లు త్వరలో ప్రకటిస్తారు. భారతదేశంలో Starlink launch కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *