
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో యూదుల సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఘోర కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పండ్ల వ్యాపారి (Fruit Seller) మరియు అతని 24 ఏళ్ల కుమారుడు నిందితులుగా ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కేసుపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది.
రిపోర్ట్స్ ప్రకారం సిడ్నీలోని ఒక ప్రాంతంలో యూదులపై కాల్పులు జరగడం జరిగింది, ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం దాడి వెనుక ద్వేషప్రేరిత నేరం (Hate Crime) కోణం ఉందా? అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు అని అధికారులు తెలిపారు. సంఘటన స్థలంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం ప్రధాన నిందితుడిగా ఒక పండ్ల వ్యాపారి పేరు వినిపిస్తోంది, అతనికి సహకరించినట్టు 24 ఏళ్ల కుమారుడిపై అనుమానం.
ఆయుధాల సమకూర్చడం, దాడి ప్రణాళికపై విచారణ జరుగుతోందని తెలుస్తోంది. అయితే, ఈ వివరాలపై ఆధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది.
ఈ ఘటన తర్వాత సిడ్నీలోని యూదుల ప్రార్థనా స్థలాలు, కమ్యూనిటీ సెంటర్ల వద్ద అదనపు భద్రత పోలీసు పెట్రోలింగ్ పెంచారు. ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. మతపరమైన సముదాయాల భద్రతపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఆస్ట్రేలియా అధికారులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ద్వేషప్రేరిత నేరాలపై జీరో టాలరెన్స్ పాలసీని మరోసారి స్పష్టం చేశారు. ఈ కేసులో ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారినట్లు సమాచారం.
ఈ కేసులో నిజాలు పూర్తిగా వెలుగులోకి రావాలంటే అధికారిక దర్యాప్తు ఫలితాలు రావాల్సి ఉంది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు ఎలా ఉంటాయన్నదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.