Bihar youth revolt

భారతదేశంలో అత్యంత యువ జనాభా కలిగిన రాష్ట్రం బీహార్. ఇక్కడ సుమారు 40 % మంది 18 ఏళ్లలోపు, ఇంకా 23 % మంది 18–29 ఏళ్ల మధ్య వయసులో ఉన్నారు. కానీ అదే సమయంలో ఈ రాష్ట్రం ఉద్యోగాలు, విద్యా మౌలిక సదుపాయాలు, వలసల సమస్యలతో సతమతమవుతోంది.

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తిరిగి అధికారాన్ని నిలుపుకోవాలనుకుంటుంది. కానీ ఈసారి Gen Z యువత అసంతృప్తి పెద్ద సవాలుగా మారుతోంది

ప్రభుత్వ డేటా ప్రకారం నిరుద్యోగం 30% నుండి 10%కి తగ్గినా, యువతకు ఉద్యోగ అవకాశాలు కనిపించడం లేదు. విద్యావంతులలో నిరాశ అధికంగా ఉంది.

గత కొన్నేళ్లుగా పేపర్ లీక్‌లు, రద్దయిన పరీక్షలు, నకిలీ నియామకాలు యువతలో విసుగును పెంచాయి. వేలాది మంది యువకులు బీహార్ వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. “మన రాష్ట్రంలో గౌరవం లేదు, అవకాశాలు లేవు” అనే భావన బలపడుతోంది.

రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తారు కానీ వాటి అమలు కనిపించదు, దీనివల్ల నమ్మకం క్షీణిస్తోంది. మోడీ మరియు ఎన్డీఏ నేతలు ఈ సవాలును గుర్తించారు.

మోడీ ర్యాలీల్లో యువతను ఉద్దేశిస్తూ “మొదటిసారి ఓటు వేయబోతున్న ప్రతి యువత మా బలం కావాలి” అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 10 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారు. మహిళలు, యువతకు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్, సబ్సిడీలు కూడా ప్రకటించారు.

అయితే వ్యతిరేక పక్షం కూడా యువతకే టార్గెట్ చేస్తోంది. ఆర్జేడీ నేత తేజశ్వీ యాదవ్ (వయసు 35), కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ “యంగ్ లీడర్‌షిప్”గా ప్రచారం చేస్తున్నారు.

బీహార్‌లో 18–29 ఏళ్ల ఓటర్లు పెద్ద మొత్తంలో ఉన్నారు. వీరి ఓటు దిశ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. యువత మోడీ నుంచి దూరమైతే, జాతీయ రాజకీయాల్లో ప్రభావం ఉంటుంది. యువత ఇప్పుడు కులం లేదా పార్టీ కంటే పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకుంటోంది.

పెద్ద వాగ్దానాలపై యువత నమ్మకం కోల్పోతోంది. ఓటర్ల జాబితా వివాదాలు, అసమానత ఆరోపణలు బీజేపీకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. మోడీ వయస్సు & యువత మధ్య గ్యాప్ తో తేజశ్వీ వంటి నాయకులు “కొత్త తరం” ప్రతినిధులుగా కనిపిస్తున్నారు.

బీహార్ ఎన్నికలు మోడీకి పెద్ద పరీక్ష. “స్మార్ట్‌ఫోన్‌లో పెరిగిన”, “రాజకీయ అవగాహన ఉన్న” Gen Z యువత ఇక పాత హామీలతో తృప్తి పడదు. వారు ఉద్యోగం, గౌరవం, నిజమైన అవకాశాలు కోరుకుంటున్నారు. మోడీ & ఎన్డీఏ ఈ అంచనాలను అందుకుంటే విజయాన్ని కాపాడుకోగలరు లేకపోతే బీహార్‌లోనే యువత తిరుగుబాటు మొదలయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *