
కోల్‌కతా నగరం ఈరోజు ఉదయం ఒక్కసారిగా భూప్రకంపనలతో వణికిపోయింది. అనూహ్యంగా వచ్చిన ఈ భూకంప తరంగాలు నగరంలోని పలుచోట్ల భయాన్ని సృష్టించాయి. ముఖ్యంగా పది అంతస్తుల పైభాగ భవనాలు, అపార్ట్‌మెంట్‌లు, పాత నిర్మాణాల్లో కంపనాలు మరింత బలంగా కనిపించాయి.
భూమి కంపించడంతో, భవనం మొత్తం ఊగిపోయింది, దాదాపు 30 సెకన్లు కంపించింది అని అక్కడి స్థానికుల అనుభవం వివరించారు.
కోల్‌కతాలోని సాల్ట్‌లేక్, హౌరా, బిహాలా, బాలిగంజ్ ప్రాంతాల్లో నివాసితులు బయటకు పరుగులు పెట్టారు.
ఈ ప్రకంపనల తీవ్రత కారణంగా కొంతసేపు విద్యుత్ నిలిచిపోయిన ప్రాంతాలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
ప్రాథమిక సమాచార ప్రకారం, ఈ ప్రకంపనల కేంద్రం బాంగ్లాదేశ్ లో మొదలై ప్రభావం పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల వరకు వ్యాపించినట్లు నిపుణులు చెబుతున్నారు. రిక్టర్ స్కేల్లో కంపనాల తీవ్రత మోస్తరు–తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా పెద్ద ప్రమాదాల సమాచారం రాలేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. అయితే, అందరూ అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాల్లో నివసిస్తున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.