SA coach Shukri Conrad on keeping India on the field

గువాహాటి-టెస్ట్‌లో, సౌత్ ఆఫ్రికా నేషనల్ క్రికెట్ టీం (SA) కోచ్ షుక్రి కాన్రాడ్ ఒక దృఢమైన మరి కొంతమందికి ఉద్రేకానకి కారణమైన నిర్ణయం తీసుకున్నారు. Day 4 ఆట తర్వాత, ఆయన చెప్పింది: మేము భారత జట్టును “grovel” చేయాలనుకున్నాం అంటే, ఒత్తిడి, అలసట, మానసికభారం రేపే విధంగా వారికి ఆడించాలని నిర్నయిన్చుకున్నట్లు చెప్పారు.

దక్షిణ ఆఫ్రికా నాల్గవ రోజు బ్యాటింగ్‌ను విస్తరించి, వారి లీడ్‌ను 548 పరుగుల దగ్గర డిక్లేర్ చేశారు. అంటే, భారత ఫీల్డర్లను, బ్యాటర్లను భయపెట్టి, స్కోరు పవర్‌తో పాటు మానసిక ప్రెషర్ కూడా పెంచారు.

SAకి టార్గెట్ ఇచ్చిన తర్వాత, భారత బౌలర్లు, ఫీల్డర్లు రాత్రి సమయంలో అలసట + కొత్త బంతితో బౌలింగ్ ద్వారా ప్రెషర్ చేసి జయించడానికి ప్రయత్నించారు.

క్రికెట్ చరిత్రలో, “grovel” అనే పదం ఒకసారి మాత్రమే కాదు, ఒక పెద్ద వివాదాన్ని రేపింది. 1976లో, టోనీ గ్రెయిగ్ అప్పట్లో వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీం పై ఈ పదం వాడి పెద్ద దుమారమే రేపాడు.

అందుకే, ఈ “grovel” మాట కేవలం ఒక సాధారణ ఆటపదంగా కాకుండా — ఒక భావోద్వేగపూరిత, చారిత్రక బాధనైనా గుర్తుచేస్తుంది.

కొందరు క్రికెట్ అభిమానులు, నిపుణులు ఈ పదాన్ని మన్నించలేకపోతున్నారు. “డొమినేషన్ సరే, కానీ మాట ఎంపిక బాగుండాలి” అని వ్యాఖ్యలు చేసారు.

సినియర్ భారత క్రికెటర్లు అనిల్ కుంబ్లే, చేటేశ్వర్ పుజారా, ఆకాష్ చోప్రా వంటి వారు, ఈ వ్యాఖ్యను తప్పు అని, ఇది క్రీడా పరిమితులను ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు.

క్రీకెట్ అంటే కేవలం ఆట కాదు…. గౌరవం, సమ్మానం, స్పోర్ట్స్‌మాన్‌షిప్, మానవత. క్రీడకు సంబంధించిన మాటలు క్రీడామైత్రికి, గౌరవానికి సంబంధించినదిగా ఉంచాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *