TSPSC Group 3 Final List Declared

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్‌-3 నియామకాలకు సంబంధించి తుది జాబితాను (Final List) అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రకటనతో వేలాది మంది అభ్యర్థుల ఎదురుచూపులకు తెరపడింది. ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంతో పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ఇది అత్యంత కీలకమైన అప్‌డేట్‌గా మారింది.

గ్రూప్‌-3 పోస్టులకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎంపిక తో పాటు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన అభ్యర్థుల పేర్లు జాబితాలో పొందుపరచడంతో తదుపరి నియామక ప్రక్రియకు మార్గం సుగమం చేసారు.

TSPSC Group 3 Final List ఎలా చెక్ చేయాలి:

  1. TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి
  2. “Group 3 Final List” లేదా “Final Selection List” లింక్‌పై క్లిక్ చేయాలి
  3. PDF ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి
  4. హాల్ టికెట్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌తో మీ పేరు ఉందో లేదో పరిశీలించాలి

గ్రూప్‌-3 తుది జాబితాలో పేరు వచ్చిన అభ్యర్థులు త్వరలోనే నియామక ఉత్తర్వులు (Appointment Orders) అందుకునే అవకాశం ఉంది. శాఖల కేటాయింపు, పోస్టింగ్ వివరాలను సంబంధిత అధికారిక ప్రకటనల ద్వారా వెల్లడించనున్నారు.

TSPSC Group 3 Final List విడుదలతో ఎంపికైన అభ్యర్థులకు కొత్త జీవన అధ్యాయం ప్రారంభమవుతోంది. ఎన్నో నెలల కష్టానికి ఇది ఫలితం. ఇకపై అధికారిక ప్రకటనలను అనుసరిస్తూ నియామక ప్రక్రియను పూర్తి చేయడం ముఖ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *