PM Kisan 21st Installment Not Credited

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ₹6,000 మూడు విడతలుగా అందిస్తోంది. అయితే చాలా మంది రైతులకు 21వ విడత (₹2,000) ఇంకా బ్యాంక్ అకౌంట్‌లో జమ కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మీ ఖాతాలో డబ్బు రాకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉండొచ్చు. వాటిని ఎలా చెక్ చేయాలి, ఎలా సరిచేయాలో ఇక్కడ వివరంగా చూద్దాం.

  1. e-KYC పూర్తి కాలేదా?

పీఎం కిసాన్ యోజనలో e-KYC తప్పనిసరి. ఇది పూర్తికాకపోతే డబ్బు రాదు. PM Kisan అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి, “e-KYC” సెక్షన్‌లోకి వెళ్లి Aadhaar OTP ద్వారా పూర్తిచేయండి, PM Kisan e-KYC పూర్తి చేసిన తర్వాతే ఇన్‌స్టాల్‌మెంట్ జమ అవుతుంది.

  1. Aadhaar–Bank Link లేకపోవడం

మీ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ నంబర్‌తో లింక్ అయి ఉండాలి. మీ బ్యాంక్ బ్రాంచి‌లో చెక్ చేయండి, NPCI ఆధార్-సీడింగ్ స్టేటస్‌ను కూడా ధృవీకరించుకోండి.

  1. తప్పు బ్యాంక్ వివరాలు

IFSC కోడ్, ఖాతా నంబర్, పేరు అసలు ఆధార్‌లో ఉన్నట్లుగా ఉండాలి. ఎలాంటి చిన్న తప్పు ఉన్నా DBT ఫెయిల్ అవుతుంది.

  1. భూసర్వే (Land Records) సమస్యలు

రాష్ట్ర భూసర్వర్‌లో మీ పేరుతో భూమి రికార్డులు అప్‌డేట్ లేకపోతే ఇన్‌స్టాల్‌మెంట్ ఆగిపోవచ్చు.

  1. పీఎం కిసాన్ స్టేటస్ ఇలా చెక్ చేయండి

pmkisan.gov.in ఓపెన్ చేయండి, Beneficiary Status క్లిక్ చేయండి, Aadhaar లేదా Mobile ద్వారా వెరిఫై చేయండి, మీ విడత జమ అయిందా లేదా ఏ తప్పు ఉందో అక్కడే చూపిస్తుంది.

ఒకవేళ డబ్బు జమ కాకపోతే క్రిషి సలహా కేంద్రం లేదా పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ కి మీ Aadhaar, land records, బ్యాంక్ వివరాలు వెంట తీసుకెళ్లి సంప్రదించండి

155261
011-24300606 / 011-23381092

21వ విడత జమ కాకపోవడానికి ప్రధాన కారణాలు e-KYC సమస్యలు, ఆధార్-బ్యాంక్ లింక్, తప్పు ఖాతా వివరాలు, లేదా రికార్డు అప్‌డేట్ కాకపోవడం. వీటిని సరిచేస్తే ₹2,000 మీ ఖాతాలోకి తప్పకుండా వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *