Andhra King Thaluka Review

ఎనర్జిటిక్ హీరో రామ్‌ మరియు సీనియర్ నటుడు ఉపేంద్ర కలిసి నటించిన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ ఈరోజు థియేటర్లలో విడుదలైంది.

రిలీజ్ ముందు నుంచే ట్రైలర్‌ మంచి హైప్‌ తెచ్చుకోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి భారీగా పెరిగింది. అయితే సినిమా నిజంగా ఆ హైప్‌కు తగ్గట్టుగా అలరించిందా లేదా? చూద్దాం.

కథ:

ఈ సినిమా కథ మొత్తం తెలుగు సినిమా మరియు అభిమానుల నేపథ్యం లో నే ఉంటుంది, ఒక స్టార్ హీరో మరియు సాధారణ అభిమాని మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటివో భావోద్వేగాలు ఉన్నాయి అనేది థియేటర్స్ లోనే చూడాలి.

రామ్‌ చేసిన పాత్ర ఒక యువ అభిమాని.ఉపేంద్ర పోషించిన పాత్ర శక్తివంతమైన ఒక సినిమా హీరో. ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు కథను ముందుకు తీసుకెళ్తాయి.

రామ్‌ ఎప్పటిలాగే ఎనర్జీ తో తన పాత్రని బాగా పండించాడు. యాక్షన్ సీన్స్‌లో అండ్ డాన్స్ లో కూడా అదరగొట్టాడు.

ఉపేంద్ర నటన ఈ సినిమాకి ఇంకో హైలైట్. అతని డైలాగులు, స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్‌లో గొప్ప స్పందన తెచ్చాయి.

హీరోయిన్‌ పాత్ర సాధారణమైనదే కానీ సపోర్టివ్‌గా ఉంది. హీరో తో రొమాంటిక్ సన్నివేశాల్లో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. థియేటర్ ల దగ్గర అభిమానుల కోలాహలం నుండి, ఇద్దరి ప్రేమికుల మధ్యలో ప్రేమ సన్నివేశాలు కూడా అన్ని కెమెరా తో చక్కగా తీశారు.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు పాటలు కూడా బాగా అలరిస్తాయి. ఎడిటింగ్ కొన్నిచోట్ల కాస్త లాగింగ్‌గా అనిపిస్తుంది.

హైలైట్స్:

రామ్‌ – ఉపేంద్ర నటన
కొన్ని పవర్‌ఫుల్ డైలాగులు
ఇంటర్వెల్ బ్లాక్

నెగటివ్:

రెండో భాగం కొన్ని సీన్స్ మందగిస్తుంది
కథలో కొత్తదనం కొద్దిగా తక్కువ

రేటింగ్: 3.25 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *