Samantha Marries Director Raj Nidimoru in Private Ceremony

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ప్రముఖ దర్శక-నిర్మాత రాజ్ నిడిమొరు (ది ఫామిలీ మాన్, Citadel ఫేమ్) ను అధికారికంగా పెళ్లి చేసుకుంది. ఈ వివాహం కోయంబత్తూరులోని ఇషా యోగ సెంటర్ లో చాలా సైలెంట్ గా, తక్కువ మందితో జరిగింది.

వివాహానికి కుటుంబసభ్యులు మరియు దగ్గరి ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. ఇది పూర్తిగా ప్రైవేట్ & సింపుల్ వెడ్డింగ్ గా నిర్వహించారు.

పెళ్లి తర్వాత సమంత తన Instagram లో ఫోటోలు షేర్ చేస్తూ “New Beginning 01-12-2025” అని రాసింది. ఈ ఫోటోలు కేవలం కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సమంత ఎరుపు రంగు సిల్క్ సంప్రదాయ చీర ధరించగా, రాజ్ నిడిమొరు వైట్ కుర్తా-ప్యాజామా బీజు నెహ్రూ జాకెట్ నేచురల్ మేకప్ మరియు సింపుల్ లుక్ లో కనిపించారు.

పెళ్లి కార్యక్రమం పూర్తిగా ట్రెడిషనల్ హిందూ రీతిలో, భూత శుద్ధి వివాహ శైలిలో జరిగింది.

వీరిద్దరూ ది ఫామిలీ మాన్ 2 షూటింగ్ సమయంలో పరిచయం అయ్యారు. తరువాత కూడా Citadel వెబ్ సిరీస్ పనిచేయడంతో బంధం ఇంకా బలపడింది. కొన్ని నెలలుగా రూమర్లు వచ్చినా, ఇద్దరూ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. చివరకు ఇప్పుడు అధికారికంగా పెళ్లి చేసుకున్నారు

సమంత మరియు రాజ్ నిడిమొరు ఇప్పుడు ఒక కొత్త కుటుంబం ప్రారంభించారు. ఫ్యాన్స్ మరియు సినీ స్నేహితులు ఇద్దరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *