
తెలుగు సినిమా పరిశ్రమలో హిట్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి మరోసారి తన మార్క్ చూపించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకరవర ప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తూ, అనిల్ రవిపూడి కెరీర్‌లో 9వ సూపర్ హిట్గా నిలిచింది.
సినిమా విడుదలైన తొలిరోజు నుంచే ప్రేక్షకుల నుంచి ఏకగ్రీవంగా పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ సమతుల్యంగా ఉండటం సినిమాకు ప్రధాన బలంగా మారింది.
పాజిటివ్ టాక్ ప్రభావంతో థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీ కొనసాగుతోంది. వర్కింగ్ డేస్ కలెక్షన్లు బలంగా ఉండటంతో పాటు, వీకెండ్ లో కూడా స్థిరమైన వసూళ్లు నమోదు చేస్తే ఈ సినిమా ఈ సంక్రాంతి సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వడం గారెంటీ.
అనిల్ రవిపూడి సినిమాలకు ప్రత్యేకమైన శైలి ఉంటుంది. కుటుంబ ప్రేక్షకులకు నచ్చే కథనం, సహజమైన కామెడీ, బలమైన భావోద్వేగాలు, ఈ అంశాలన్నింటిని మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో కూడా విజయవంతంగా మిళితం చేయగలిగారు.
ఈ సినిమా సాధారణ కుటుంబ కథను వినోదాత్మకంగా చెప్పడం వల్ల అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇది ఒక పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా మారింది.
మన శంకరవర ప్రసాద్ గారు విజయంతో అనిల్ రవిపూడి బాక్సాఫీస్ సక్సెస్ ట్రాక్ మరోసారి నిరూపితమైంది. 9వ సూపర్ హిట్‌తో ఆయన మార్కెట్ మరింత బలపడగా, రాబోయే ప్రాజెక్టులపై కూడా అంచనాలు పెరిగాయి. ప్రేక్షకుల ఆదరణ కొనసాగితే ఈ సినిమా ఇంకా పెద్ద స్థాయి విజయాన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.