Good Luck Sakhi Review: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుడ్ లక్ సఖి మూవీ ఎట్టకేటలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఊహించినట్టుగానే ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది. క్రిటెక్స్ నుంచి సైతం ఈ మూవీకు మంచి రివ్యూస్ వస్తున్నాయి. మార్డన్ మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేశ్ తెలంగాణ ఊరి ఆడపిల్లగా అద్భతంగా నటించిందని ఆడియన్స్ అంటున్నారు.
గుడ్ లక్ సఖి నటులు, దర్శకులు, ప్రొడ్యూసర్
ఈ సినిమాలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించింది. ఆది పినిశెట్టి కీర్తి బాయ్ ఫ్రెండ్ గా జగపతి బాబు కోచ్ గా నటించారు. నాగేశ్ కుకునూర్ దీనికి కథను రాయడంతో పాటు ఆయనే తెరకెక్కించారు. సుధీర్ చంద్ర పదిరి ఈ మూవీను worth a short motion arts బ్యానర్ పై నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీను హ్యాండిల్ చేశారు.
గుడ్ లక్ సఖి సినిమా కంప్లీట్ గా ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా. తెలంగాణ ఊరిలో సఖి అనే అల్లరి అమ్మాయి ఉంటుంది. ఆమె వల్ల ఎప్పుడూ అందరి పనులు చెడిపోతాయి, దీంతో సఖికి బ్యాడ్ లక్ సఖి అని పేరు వస్తుంది. రాహుల్ రామకృష్ణ సఖిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ సఖికి ఇష్టం ఉండదు. సఖి, ఆదిపినిశెట్టి ఇద్దరూ మంచి మిత్రులు, తరువాత ప్రేమించుకుంటారు.
సఖికి గురిచూసి కొట్టంలో చాలా ఎక్స్ పర్ట్ ఈ టాలెంట్ చూసి జగపతి బాబు ఆమెను షూటింగ్ లో నేషనల్ ప్లేయర్ ని చేయాలనుకుంటాడు. షూటింగ్ లో సఖి ఎలా నేషనల్ ప్లేయర్ అవుతుంది. ఊరిలో గుడ్ సఖిగా ఎలా పేరు తెచ్చుకుంటుందన్నదే ప్రధాన కథ
సినిమా ఎలా ఉందంటే?
మొత్తం కుటుంబం కలిసి చూడదగ్గ సినిమా. కీర్తి సురేశ్ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తుంది. ఆదిపినిశెట్టి, కీర్తి కెమిస్ట్రీ బాగంది. రాహుల్ రామకృష్ణ కామెడీ బాగా పండింది. కోచ్ గా జగపతి బాబు అద్భతంగా నటించారు. తొలి వారమే ఈ సినిమా సుమారు 15 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.