Kothala Rayudu Movie Review: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కోతల రాయుడు సినిమా, థియేటర్లలో విడుదలైంది. సినిమాను బాగా ఎంజాయ్ చేసామని ఆడియన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఊహించినట్లుగానే ప్రేక్షకులను సినిమా కడుపుబ్బా నవ్వించింది. క్రిటిక్స్ ఈ సినిమా గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం.
కథ
రొటీన్ కామెడీ సినిమాలకు కొంచం భిన్నంగా ఈ మూవీ ఉంటుంది. కోతల రాయుడు పాత్రలో శ్రీకాంత్, అతని స్నేహితుడిగా సత్యం రాజేష్ నటిస్తాడు. నటాషా దోషి, డింపుల్ చొపాడే హీరోయిన్లుగా కనిపిస్తారు. శ్రీకాంత ఎప్పుడూ డబ్బులో మునిగి తేలే క్యారెక్టర్. తనకు ఉన్న టాలెంట్, ట్రాక్స్ తో డబ్బును సంపాదిస్తుంటాడు. ఇంతలోనే శ్రీకాంత్ ను హీరోయిన్ పరిచయమవుతుంది. ఆమె చాలా ధనికురాలు కావడంతో వివాహం చేసుకోవాలనుకుంటాడు కోతల రాయుడు. చివరికి ఈ మూవీలో ఏం జరుగుతుంది, వారిద్దరి వివాహం ఎలా జరుగుతుంది, శ్రీకాంత్ ఎలా తన అప్పులను తీరుస్తాడనేది చాలా ఫన్నీ, ఇంట్రెస్టింగ్ పాయింట్స్
నటీనటులు
శ్రీకాంత్, డింపుల్ చొపాడే, నటాషా దోషి ప్రదాన పాత్రల్ని పోషించారు. సత్యం రాజేష్, హేమ, పృథ్వి రాజ్, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ మెయిన్ సపోర్టింగ్ రోల్స్ లో కనిపించారు. సీహెచ్ సుధీర్ రాజు దీనికి కథను అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఎఎస్ కిశోర్, కొలన్ వెంకటేశ్ కలిసి ఈ చిత్రాన్ని ఎ.ఎస్.కె ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేశారు.
మూవీ పేరు | కోతల రాయుడు |
దర్శకులు | సిహెచ్. సుధీర్ రాజు |
కథ, స్క్రీన్ ప్లే | సిహెచ్. సుధీర్ రాజు |
నటీ నటులు | శ్రీకాంత్, నటాషా దోషి, డింపుల్ చొపాడే |
సంగీత దర్శకులు | సునీల్ కశ్యప్ |
నిర్మాతలు | ఎఎస్ కిశోర్ & కొలన్ వెంకటేశ్ |
ప్రొడక్షన్ బ్యానర్ | ఎ.ఎస్.కె ఫిలిమ్స్ |
సినిమా ఎలా ఉందంటే
పిల్లలు, పెద్దలు, మొత్తం ఫ్యామిలీ కలిసి ఖచ్చితంగా చూడవచ్చు. అభ్యంతరకర సన్నివేశాలు ఏవీ లేవు. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమా ఉంది. శ్రీకాంత్, సత్యం రాజేశ్ కలిసి చేసే కామెడీ మన పొట్ట చెక్కలయ్యేలా చేస్తుంది. డైలాగ్స్, డైరక్షన్ బాగానే వచ్చినా.. స్ర్రీన్ ప్లేలో కొంత బెటర్ చేసే బాగుండేదనిపించింది. వీకెండ్ లో బాగా నవ్వి ఎంజాయ్ చేయాలనుకుంటే.. ఈ సినిమాకు వెళ్లాల్సిందే..