Athadu Aame Priyudu Movie Review: ప్రముఖ రచయితలు యెండమూరి వీరేంద్రనాధ్ రచించిన, దర్శకత్వం వహించిన సినిమా “అతడు ఆమె ప్రియుడు” థియేటర్లలో రిలీజ్ అయి సందడి చేస్తోంది. పుష్పలో విలన్ గా మాస్ క్యారెక్టర్ లో కనిపించిన సునీల్ ఈ సినిమాలో మరోసారి మనకు కమెడియన్ గా కనిపించి అలరిస్తాడు. సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉందంటూ మూవీ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.
కథ
అతడు ఆమె ప్రియుడు సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాఫీగా సాగిపోతుంది. అన్ని జానర్లు ఈ సినిమాలో ఉండడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకుంటుంది. సునీల్ కామెడీ మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. త్వరలోనే పెద్ద ప్రళయం వచ్చి అందరూ చనిపోతారని, కరోనాతో ఇది ఆరంభం అయిందని అందులోని ఓ క్యారెక్టర్ మనకు వివరిస్తాడు. సినిమాలో కౌశల్ ఒకరిని మర్డర్ చేస్తాడు. మొత్తం సినిమా చాలా ఆసక్తిగా సాగుతుంది. ఈ మూవీ కథను పూర్తిగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే
అతడు ఆమె ప్రియుడు సినిమా నటీనటులు
సునీల్ కౌశల్ మంద ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్స్ ప్ల చేశారు. బెనర్జీ, మహేశ్వరి వడ్డి, ప్రియాంక, సుపుర్ణ, భూషన్, జెన్నీ ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్స్ లో నటించారు. ప్రముఖ రచయితలు యెండమూరి వీరేంధ్రనాత్ దీనికి కథ రాయడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి కలిసి ఈ సినిమాను సంధ్య మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు.
మూవీ పేరు | అతడు ఆమె ప్రియుడు |
డైరెక్టర్ | యెండమూరి వీరేంద్రనాథ్ |
నటీనటులు | సునీల్, కౌశల్ మంద, బెనర్జీ, మహేవ్వరి వడ్డి, ప్రియాంక, సుపుర్ణ, భూషన్, జెన్ని |
నిర్మాతలు | రవి కనగాల, రాం తుమ్మలప్పలి |
ప్రొడక్షన్ బ్యానర్ | సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ |
సినిమా ఎలా ఉందంటే
ఎక్సపెక్టేషన్స్ కు ఈ సినిమా రీచ్ కాలేదని చెప్పవచ్చు. యెండమూరి వీరేంద్రనాధ్ సాహిత్యంంలో చాలా పెద్ద రచయిత. గత 3 దశాబ్దాలుగా ఆయన ఎన్నో రచనలు చేశారు. ఈ సినిమా డైలాగ్స్ లో సీరియస్నెస్, కామెడీ అంతగా పండలేదు. అన్ని జానర్లను ఈ మూవీలో మిక్స్ చేశారు.
మూవీ రేటింగ్ : 2.5 / 5