Save The Tigers Telugu Review

Save The Tigers Telugu Review: ఈ మధ్య కాలం లో, బాలీవుడ్ తో పోటీ పడ్తూ , మంచి మంచి వెబ్ సిరీస్ లని మరియు సినిమాలని మన తెలుగు మేకర్స్ OTT లో ప్రెసెంట్ చేస్తున్నారు. ఎటి యం, గాలివాన, లాక్డ్ , లాంటి మంచి సిరీస్ ల తరువాత, సేవ్ ది టైగర్స్ అనే కొత్త వెబ్ సిరీస్ ని హాట్ స్టార్ మన కి ప్రెసెంట్ చేసింది, అయితే ఈ సిరీస్ ట్రైలర్ విడుదల తరువాత, చాల మంది ఈ సిరీస్ కోసం ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఇక ఈరోజు ఈ సిరీస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ ఐంది, ఇక వెంటనే రివ్యూ లోకి వెళ్లి ఈ సిరీస్ ఎలా ఉందొ తెల్సుకుందాం.

Save The Tigers Telugu Review

కథ

సేవ్ ది టైగర్స్ సిరీస్ ఘంటా రవి (ప్రియదర్శి) రాహుల్ అభినవ్ (అభినవ్ గోమతం) విక్రమ్ చైతన్య (చైతన్య కృష్ణ) ఈ ముగ్గురి జీవితాలని వివరిస్తుంది. ఈ ముగ్గురు ఒక ఈవెంట్ లో కలుసుకుంటారు, కలుసుకున్న వెంటనే, వాళ్ళ ముగ్గురి సమస్య వాళ్ళ భార్యలే అయినందు వాళ్ళ ఇంకా త్వరగా స్నేహితులు అవుతారు, అయితే ఆ ఈవెంట్ లో ఈ ముగ్గురు చేసిన పనుల వాళ్ళ, విల్లా భార్యల నుంచి ఇంకా ఎక్కువ టార్చర్ ని ఎదుర్కోవడం స్టార్ట్ చేస్తారు. అయితే వాళ్ళు ఏ ఈవెంట్ కి వెళ్లారు, వాళ్ళు చేసిన పని ఏంటి అనేది మిగతా కథ.

సేవ్ ది టైగర్స్ సిరీస్ నటీనటులు

ప్రియదర్శి, అభినవ్ గోమతం, కృష్ణ కృష్ణ, సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని, గంగవ్వ, హర్షవర్ధన్, రోహిణి, సద్దాం, తదితరులు నటించిన ఈ సిరీస్ కి ప్రదీప్ అద్వైతం కథని అందించారు ఇక దర్శకత్వం వహించింది తేజ కాకుమాను , ఛాయాగ్రహణం ఎస్ వి. విశ్వేశ్వర్ , సంగీతం అజయ్ అరసాడ.

సినిమా పేరు సేవ్ ది టైగర్స్ 
దర్శకుడు తేజ కాకుమాను
నటీనటులు ప్రియదర్శి, అభినవ్ గోమతం, కృష్ణ కృష్ణ, సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని, గంగవ్వ, హర్షవర్ధన్, రోహిణి, సద్దాం, తదితరులు
నిర్మాతలు తేజ కాకుమాను
సంగీతం అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ ఎస్ వి. విశ్వేశ్వర్
ఓటీటీ రిలీజ్ డేట్ 27- ఏప్రిల్ – 2023
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్

సేవ్ ది టైగర్స్ సిరీస్ ఎలా ఉందంటే?

మన దైనందిన జీవితంలో రోజు ఎదుర్కునే సమస్యలని సినిమాలో గాని సిరీస్ లో గాని చూస్తే ఇట్టే కనెక్ట్ అవ్వడం కాయం. సరిగ్గా ఈ సిరీస్ లో భార్య భర్తల మధ్య గొడవలు, భార్యలు పెట్టె టార్చర్ ఎలా ఉంటుంది అని ఆధ్యంతం కామెడీ తో ఇంట్రెస్టింగ్ గా చూపించారు.

కథ పరంగా చూస్కుంటే, కొత్తదనం ఏమి లేకపోయినా, మంచి నటి నటులు, దానికి తోడు, మంచి కామెడీ ఉండడం వాళ్ళ, ప్రతి ఎపిసోడ్ బోర్ కొట్టకుండా వెళ్ళిపోతుంది. మద్యలో రెండు ఎపిసోడ్ లు కొంచెం తడబడిన, కామెడీ కాపాడింది అని చెప్పొచ్చు.

ప్రియదర్శి, గంట రవి పాత్రలో అవలీల గా నటించాడు, తెలంగాణ యాసలో , తను చేసిన కామెడీ మనం ఇంతక ముందు బలగం లో చూసాము. ప్రతి ఎక్స్ప్రెషన్ , డైలాగ్ డెలివరీ అన్ని చాల బాగా చేసాడు. అభినవ్ గోమాటం, ఈ నగరానికి ఏమైంది లో ఉన్నంత కామెడీ చేయకున్నా, పర్వాలేదన్పించాడు, ఇక చైతన్య కృష్ణ ఎప్పట్లాగే బహన్ చేసాడు. పావని గంగి రెడ్డి ఉన్నంతలో బాగానే చేసింది, జబర్దస్త్ సుజాతకి మంచి పాత్ర దొరికింది మరియు తను తెలంగాణ భాష అలావాటు ఉండడంతో అవలీల గా చేసింది, ఇక మిగతా నటి నటులు తమ తమ పాత్రల మేరకు బాగానే చేసారు.

తేజ కాకుమాను కథ మీద కొంచెం వర్క్ చేయాల్సింది, కానీ తను మొత్తం కామెడీ నే నమ్ముకున్నాడు అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ సిరీస్ ని ఎంగేజింగ్ గా తీయడం లో విజయం సాధించాడు అనిపిస్తుంది.

మొత్తం మీద, సేవ్ ది టైగర్స్ ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి ఎంగేజింగ్ కామెడీ సిరీస్.

ప్లస్ పాయింట్లు:

  • కామెడీ

మైనస్ పాయింట్లు:

  •  కథ
  • అక్కడక్కడా స్లో కథనం

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *