Ugram Movie Telugu Review

Ugram Movie Telugu Review: గత కొన్ని సంవత్సరాలుగా అల్లరి నరేష్ హిట్ కోసం చూస్తున్న టైం లో , కొత్త దర్శకుడు విజయ్ కనక మేడలతో నాంది అనే చిత్రం తో మన ముందుకు వచ్చి విజయం సాధించాడు. అయితే అదే విజయాన్ని కోన సాగించలేక పోయాడు, నాంది తరువాత వచ్చిన ఇట్లు మారేడుమల్లి ప్రకానీకం అనే చిత్రం తో మల్లి పరాజయాన్ని చవి చూసాడు. అయితే అల్లరి నరేష్ కామెడీ సినిమాలని చాల వరకు తగ్గించి, కొత్త రకం కథలతో, అందులోనూ చాల సీరియస్ పాత్రలతో మన ముందుకు వస్తున్నాడు. అయితే ఇప్పుడు నాంది దర్హకుడు విజయ్ కనక మేడల తో ‘ఉగ్రం’ అనే చిత్రం మన ముందుకొచ్చాడు, ఇక ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

Ugram Movie Telugu Review

కథ

శివ కుమార్ (నరేష్) ఒక పోలీస్ ఆఫీసర్, సిటీ లో వరుసగా చిన్న పిల్లలు కిడ్నప్ అవ్వడం తో ఆ కేసు ని శివ కుమ్మరి కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక ఈ ప్రాసెస్ లో శివ కుమార్ కూతురిని ని కూడా కిదనప్ చేయడం మరియు తన భార్య చనిపోవడంతో శివ కుమార్ జీవితం తలకిందులవుతుంది. మానసికంగా చాల క్రుంగి పోయిన శివ కుమార్ ఉద్యోగం కి లీవ్ పెట్టాల్సి వస్తుంది, కానీ దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలని సొంతంగా ప్రయత్నాలు మొదలుపెడతాడు, చివరికి ఎలా కనుక్కున్నాడు అనేది మిగతా కథ.

ఉగ్రం మూవీ నటీనటులు

అల్లరి నరేష్, మీర్నా, మణికంఠ వారణాసి, ఇంద్రజ, శత్రు, శరత్ లోహితాశ్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి టుం వెంకట్ కథ అందించారు ఇక దర్శకత్వం వహించింది విజయ్ కనకమేడల , సంగీతం అన్హదించింది శ్రీ చరణ్ పాకాల , ఛాయాగ్రహణం సిద్ధార్థ్ జె, ఇక సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది ఈ చిత్రాన్న షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించారు.

సినిమా పేరు ఉగ్రం
దర్శకుడు విజయ్ కనకమేడల
నటీనటులు అల్లరి నరేష్, మర్నా, మణికంఠ వారణాసి, ఇంద్రజ, శత్రు, శరత్ లోహితాశ్వ తదితరులు
నిర్మాతలు సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది
సంగీతం శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ సిద్ధార్థ్ జె
ఓటీటీ రిలీజ్ డేట్ ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ధ్రువీకరించలేదు

ఉగ్రం సినిమా ఎలా ఉందంటే?

ఉగ్రం అనే చిత్రం ఒక సింపుల మరియు రొటీన్ రేవేంజే చిత్రం, సినిమా మొదట్నుంచి ఉగ్రం కథనం ఒక రెగ్యులర్ టెంప్లెట్ ని అనుసరిస్తూ నడుస్తూ ఉంటుంది. హీరో ఒక ఉద్యోగి, భార్య పిల్లల్తో సంతోషంగా ఉంటాడు, అనుకోకుండా తన కుటుంబానికి ఏదో జరగడం, హీరో వారి మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేయడం. ఇలాంటి సినిమాలు చాల చూసారు మన తెలుగు ప్రేక్షకులు, అయితే ఉగ్రం చెప్పుదగ్గ విషయం ఏంటి అంటే , హీరో కి జరిగిన సంఘటనని ని సామాజిక సమస్యగా కనెక్ట్ చేయడం.

ఇక కథ ఎలా ఉన్నప్పటికీ , పతాక సన్నివేశాలతో కొన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే అవకాశాలు అయితే ఉన్నాయ్. కథ లో కొంచెం కొత్తదనం ఉంటె, నరేష్ కనిపించిన తీరుకి సినిమా వేరే లెవెల్ లో ఉండేది. ఏది ఏమైనా, ఈ చిత్రం నాంది లాగ నడుస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

శివ కుమార్ పాత్రలో నరేష్ బాగా చేసాడు, అయితే నరేష్ ఇంతక ముందు చేసినా శంభో శివ శంభో, సంఘర్షణ వంటి చిత్రాల్లో చేసిన పాత్రలకి ఏ మాత్రం సాటి రాదూ. నాంది లోచేసిన విధంగా చేసాడు కాకపోతే దీంట్లో చాల సిరీస్ గా కనిపించాడు. ఇక మిర్న స్క్రీన్ టైం తక్కువే ఉన్నప్పటికీ పర్వాలేదన్పిస్తుంది. ఇక శరత్ లోహితాశ్వ, ఇంద్రజ , శత్రు తదితరాలు వారి పాత్రల మేరకు బాగా చేసారు.

నాంది లో పోలీస్ లకి వ్యతిరేకంగా చూపించిన విజయ్ కనక మేడల, ఉగ్రం లో పోలీస్ లకి పాజిటివ్ గా చూపించేసాడు. ఒక పోలీస్ ఆఫీసర్ కి ఎంత ప్రెషర్ ఉంటుంది, పెర్సనల్ లైఫ్ ని మరియు ప్రొఫెషనల్ లైఫ్ ని బాలన్స్ చేయడం ఎంత కష్టం, ఇలాంటి పాయింట్స్ బాగా చూపించాడు, కానీ ఓవరాల్ గా కథ పరంగా చూసుకుంటే ఒక మాములు రేవంజి కథ అవ్వడం తో పెద్దగా ఇంప్రెస్ చేయలేక పోయాడు.

సాంకేతికంగా ఉగ్రం జస్ట్ ఓకే అనిపిస్తుంది, శ్రీ చరణ్ పాకాల పాటలు ఆకట్టుకోవు అలాగే నేపధ్య సంగీతం కూడా ఇంకా బాగుండాల్సింది. ఇక సిద్ధార్థ్ జె ఛాయాగ్రహణం పర్వాలేదు.

ఓవర్ అల్ గా, ఉగ్రం రొటీన్ రివెంజ్ యాక్షన్ చిత్రం.

 

ప్లస్ పాయింట్లు:

  • నరేష్
  • కొన్ని సన్నివేశాలు

మైనస్ పాయింట్లు:

  • ఉహించదగిన కథనం

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *