Custody Movie Telugu Review

Custody Movie Telugu Review: థాంక్యూ తోపరాజయం చవి చుసిన నాగ చైతన్య, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అని , తమిళ్ దర్శకుడు ఐన వెంకట్ ప్రభుతో కస్టడీ అనే చిత్రాన్ని చేసారు. అయితే మొదట్లో ఈ సినిమా మీద కూడా పెద్దగా అంచనాలు లేవు, అయతే ఒక్కసారి టీజర్ మరియు ట్రైలర్ విడుదల అయ్యాక అంచనాలు తారుమారయ్యాయి. ఇక ఈ సినిమా మీద నాగ చైతన్య కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండంతో అంచనాలు రెట్టింపయ్యాయి, ఇక ఆ అంచనాలను మోస్తూ ఈరోజు ఈ చిత్రం విడుదల ఐంది, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఏ చిత్రం ఎలా ఉంది తెల్సుకుందాం.

Custody Movie Telugu Review

కథ

శివ (నాగ చైతన్య ) సఖినేటిపళ్ళు స్టేషన్ లో కానిస్టేబుల్, అయితే తను ప్రేమిచిన అమ్మాయి కి వేరే పెళ్లి అవుతుండంతో, ఆ పెళ్లి ని ఎలాగైనా ఆపాలి అని వెళ్తున్న టైం లో, పోలీస్ స్టేషన్ లో ఉన్న రాజన్న (అరవింద్ స్వామి) అనే క్రిమినల్ ని ఎవరో చంపేస్తున్నారని తెలుస్తుంది. ఇక నిజమా ఆలస్యం ఐన గెలుస్తుంది అని నమ్మే శివ, తనని చనిపోకుండా కాపాడాలని, స్టేషన్ నుండి, తప్పిస్తాడు, అయితే రాజన్న తో పాటు శివ మరియు తన ప్రేయసి ఐన రేవతి(కృతి శెట్టి) ని కూడా తీసుకెళ్తాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీస్ లు, శివ మరియు రాజన్న ని వెతకడం మొదలు పెడ్తారు. చివరికి శివ గెలిచాడా లేదా అనేది మిగతా కథ.

కస్టడీ మూవీ నటీనటులు

నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాథ్, వెన్నెల కిషోర్, ప్రేమి అమరెన్, సంపత్ రాజ్ మరియు ప్రియమణి తదితరులు నటించిన . ఈ చిత్రానికి
దర్శకుడు వెంకట్ ప్రభు, ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు, ఎస్ ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు మరియు శ్రీనివాస చిట్టూరి. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవరించారు.

సినిమా పేరు కస్టడీ
దర్శకుడు వెంకట్ ప్రభు
నటీనటులు నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, తదితరులు
నిర్మాతలు శ్రీనివాస చిట్టూరి
సంగీతం ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ ఎస్ ఆర్ కతిర్
ఓటీటీ రిలీజ్ డేట్ ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ధ్రువీకరించలేదు

కస్టడీ సినిమా ఎలా ఉందంటే?

నాగ చైతన్య మాస్ ఇమేజ్ కోసం ఆటో నగర్ సూర్య తో నే ప్రయత్నం చేసాడు, కానీ ఆ చిత్రం ప్లాప్ ఐన కూడా నాగ చైతన్య కి కొంత మాస్ ఇమేజ్ అయితే ఏర్పడింది. ఇక ఈ కస్టడీ నాగ చైతన్య కి మంచి మాస్ చిత్రం అని చెప్పొచ్చు. చిత్రం మొదట్లో కొంత స్లో గా అనిపించినా, ఎప్పుడైతే హీరో, విలన్ ని చనిపోకుండా కాపాడాలి అని నిర్ణయించున్నప్పటినుంచి, ఫాస్ట్ స్క్రీన్ ప్లే తో ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు వెళ్ళిపోతుంది, ఇక ఇంటర్వల్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అంతే.

రెండవ భాగం లో కథ చాల మలుపులు తిరుగుతూ ఉంటుంది, అయితే ఇదంతా మిమ్మల్ని సీట్లో కదలకుండా లీనమై చూసేలా చేస్తుంది. వెంకట్ ప్రభు మార్క్ స్క్రీన్ప్లే మ్యాజిక్ సగటు ప్రేక్షకుణ్ణి ఎంగేజ్ చేస్తుంది. మరి టూ కమర్షిల్గా వెళ్లకుండా చాల సింపుల్ గ హీరో పాత్రతో ప్రేక్షకులు ట్రావెల్ అవుతారు. ఇక క్లైమాక్స్ కూడా అందుకు తగ్గట్టు గానే చాల బాగా డిజైన్ చేసారు.

ఇక శివ పాత్ర నాగ చైతన్య కెరీర్ లో బెస్ట్ పాత్ర అని చెప్పొచ్చు, నటన పరంగా కూడా ఒక మెట్టు ఎక్కాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక కృతి శెట్టి కి కూడా స్క్రీన్ టైం ఉన్న పాత్ర దొరికింది, కానీ తను ఇంకా బాగా నటిచాల్సింది, ఇక అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి అందరూ తమ పాత్రలకి న్యాయం చేసారు.

వెంకట్ ప్రభుకి ఒక ప్రతేయకమైన శైలి ఉంటుంది, తన స్క్రీన్ప్లే గురించి తమిళ ప్రేక్షకులకి బాగా తెల్సు, కానీ తెలుగు ప్రేక్షకులకి అంతగా తెలీదు. ఇక ఈ కస్టడీ లో కూడా ప్రేక్షకుడ్ని ఎంగేజ్ చేసే అంశాలని పొందుపరిచి, తన మార్క్ స్క్రీన్ప్లే తో ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో విజయం సాధించారు.

కస్టడీ సాంకేతికంగా ఉన్నతంగా కనిపిస్తుంది, ఇళయరాజా మరియు యువన్ శంకర్ రాజా పాటలు అంతగా లేవు కానీ నేపధ్య సంగీతం మాత్రం చాల బాగుంది, ఇక ఎస్ ఆర్ కతిర్ ఛాయాగ్రహణం సినిమా మూడ్ ని చాల బాగా కాప్చర్ చేసారు.

మొత్తం మీద, కస్టడీ, వెంకట్ ప్రభు మార్క్ యాక్షన్ డ్రామా.

ప్లస్ పాయింట్లు:

  • కథనం
  • ట్విస్టులు

మైనస్ పాయింట్లు:

  • లవ్ ట్రాక్

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *