Newsense Web Series Telugu Review

Newsense Web Series Telugu Review: OTT లో ఇదివరకే నవదీప్ మన ముగ్గురి లవ్ స్టోరీ, గ్యాంగ్స్టార్స్ , మస్తిస్ చేసిన అనుభవ ఉన్న ఏ హీరో, మల్లి న్యూ సెన్స్ అనే సిరీస్ తో మన ముందుకొచ్చాడు. మస్తిస్ తరువాత నవదీప్ కి ఆహా వీడియో తో ఇది రెండవ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది అందులోనూ నవదీప్ ఈ సిరీస్ తనదైన రీతి లో ప్రమోట్ కూడా చేసాడు. ఇక ఆలస్యం ఈ సిరీస్ చూడొచ్చా లేదా తెల్సుకుందాం.

Newsense Web Series Telugu Review

కథ

శివ(నవదీప్ ) మధన పల్లి టౌన్ లో జర్నలిస్ట్, మీడియా కి తెల్సిన నిజాన్ని న్యూ లో రాస్తే వస్తే డబ్బు కంటే, రాయకుండా ఉంటెనే ఎక్కువ డబ్బులు వస్తాయి అని నమ్మే వ్యక్తి. అలంటి టైం లో పోలీస్ లు ఒక అకర్మ ఆయుధాల ముఠాని ఎన్కౌంటర్ చేస్తారు, ఈ ఇన్సిడెంట్ వెనక ఒక రాజకీయ నాయకుడి హస్తం ఉంది అని తెలుసుకున్న శివ, ఆ రాజకీయ నాయకున్ని ఎక్కువ మొత్తం లో డబ్బు అడుగుతాడు, దీంతో తన జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. చివరికి శివ ఎం చేసాడు అనేది మిగతా కథ.

న్యూసెన్స్ వెబ్ సిరీస్ నటీనటులు

నవదీప్ , బిందు మాధవి మరియు తదితరులు నటించిన ఈ సిరీస్ కి శ్రీ ప్రవీణ్ కుమార్ దర్శకుడు, వేదరామన్ ఛాయాగ్రహణం వహించారు , సంగీతం సురేష్ బొబ్బిలి, ఇక టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు.

వెబ్ సిరీస్ పేరు న్యూసెన్స్
దర్శకుడు శ్రీ ప్రవీణ్ కుమార్
నటీనటులు నవదీప్ , బిందు మాధవి, తదితరులు
నిర్మాతలు  టీజీ విశ్వప్రసాద్
సంగీతం సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ వేదరామన్
ఓటీటీ రిలీజ్ డేట్ మే 12 2023
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా వీడియో

న్యూసెన్స్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

న్యూ సెన్స్ కథ మామూలుదే ఐన, దాని నేపధ్యం ప్రేక్షకుడి కట్టిపడేస్తుంది. మొదటి ఎపిసోడ్ నుంచే కథలోకి వెళ్లి అసలు మీడియా ఎలా పని చేసస్తోంది అనేది నిక్కచ్చిగా చూపించడం ఈ సిరీస్ ప్రత్యేకత. న్యూ సెన్స్ కథ మామూలుదే ఐన, దాని నేపధ్యం ప్రేక్షకుడి కట్టిపడేస్తుంది. మొదటి ఎపిసోడ్ నుంచే కథలోకి వెళ్లి అసలు మీడియా ఎలా పని చేసస్తోంది అనేది నిక్కచ్చిగా చూపించడం ఈ సిరీస్ ప్రత్యేకత. మీడియా కి రాజకీయ నాయకులకి ఉండే సంబంధం, జర్నలిస్టులు జీవితాలు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలు చాల బాగా చూపెట్టారు. అయితే కథ పరంగా చూస్తే, కొత్తగా అయితే అనిపించదు, కాకపోతే సిరీస్ లో ఉండే పత్రాలు, మీడియా వాళ్ళ ఎవరు లాభం పొందుతున్నారు , ఎవరు నష్టపోతున్నారు అనేవి ఎంగేజింగ్ పాయింట్స్ అని చెప్పొచ్చు.

నటన పరంగా నవదీప్ ఎప్పుడు నిరాశపరచాడు, ఇందులో శివ అనే పాత్రలో ఒదిగి పోయడానికి చెప్పొచ్చు, ఇక ఈ శివ పాత్రకి నెగటివ్ షేడ్స్ ఉండడంతో, నటించే స్కోప్ ఎక్కువగా ఉంది, ఇక నవదీప్ ఆ పాత్రకి ఎం కావాలో అది చేసాడు, బిందు మాధవి పాత్ర కూడా హీరో కి తక్కువ ఏమి కాదు మరియు తను కూడా బాగా నటించింది. ఇక మిగిలిన తారాగణం పాత్రల మేరకు బాగా చేసారు.

శ్రీ ప్రవీణ్ కుమార్, ఎంచుకున్న నేపధ్యం చాల బాగుంది, మీడియా మీద ఈ మధ్యకాలం లో ఫుల్ లెన్త్ చిత్రాలు రాలేదు, అయితే కథ ఇంకా బాగా వ్రాసుకుని ఉండాల్సింది, ఏది ఏమైనప్పటికి, మీడియా గురించి నిక్కచ్చిగా చూపించడం, మాటలు, నటన, ఈ పాయింట్స్ తో ప్రేక్షకులని ఎంగేజ్ చేసాడని చెప్పొచ్చు.

న్యూ సెన్స్ సాంకేతికంగా బాగుంది, కానీ ఇంకా బాగుండాల్సింది, ఇక సురేష్ బొబ్బిలి పాటలు అంతగా ఆకట్టుకోవు కానీ తన నేపధ్య సంగీతం తో మంచి మార్కులు కొట్టేసాడు, ఇక వేదరామన్ ఛాయాగ్రాణం ఈ సిరీస్ కి ప్లస్ పాయింట్.

ఓవర్ అల్ గా, న్యూ సెన్స్ ఈ మధ్య కాలం లో వచ్చిన బెస్ట్ పొలిటికల్ డ్రామా.

ప్లస్ పాయింట్లు:

  • కథనం
  • మాటలు

మైనస్ పాయింట్లు:

  • ఉహించదగిన నరేషన్

న్యూసెన్స్ వెబ్ సిరీస్ రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *