Lokah Chapter 1 Chandra Becomes First Malayalam Movie to Enter ₹300 Crore Club OTT Update Inside

Lokah Chapter 1: Chandra దుమ్ము దులిపేస్తోంది! ₹300 కోట్ల మైలురాయి దాటిన తొలి మలయాళ సినిమా ఇది. రిలీజ్ అయిన నాటి నుంచి థియేటర్లలో తుపాన్ సృష్టిస్తోంది! డొమినిక్ అరుణ్ డైరెక్ట్ చేసిన ఈ ఫాంటసీ-యాక్షన్ డ్రామాలో కళ్యాణి ప్రియదర్శన్ మరియు నస్లీన్ లీడ్ రోల్స్‌లో అద్భుతంగా రాణించారు.

ఈ మూవీ ఇప్పుడు మలయాళం చిత్రాల్లోనే హిస్టరీ క్రియేట్ చేసింది — ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్ల మార్క్ క్రాస్ చేసిన మొదటి మలయాళ సినిమా అయ్యింది.

సుమారుగా ౩౦ కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా భారతదేశంలో ₹154 కోట్లు, మొత్తం గ్లోబల్ కలెక్షన్ ₹300 కోట్లను దాటి మలయాళం సినిమా రేంజ్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్లింది.

దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీకి గర్వకారణం. సూపర్‌హీరో ఎలిమెంట్స్, మిథాలజీ, ఎమోషన్‌ ఇలా అన్నీ పర్ఫెక్ట్ బ్లెండ్‌ చేసిన ఈ చిత్రం రిలీజ్ ఐన అన్ని భాషల్లో కూడా అదరగొట్టేసింది .

కళ్యాణి ప్రియదర్శన్ చంద్రగా డెస్టినీ మరియు డ్యూటీ మధ్య క్లాష్‌లో తపించే యువతిగా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ ప్రత్యేక పాత్రలు ‘Lokah Universe’ కథని మరింత ఎక్సైట్ చేశాయి. జాక్స్ బిజోయ్ మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ సినిమా విజయానికి దోహదపడడ్డాయి.

ఇక OTT రిలీజ్ కోసం ఫ్యాన్స్ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం, JioHotstar లో అక్టోబర్ 20 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలయ్యే చాన్స్ ఉంది.
అయితే మేకర్స్ నుంచి అధికారిక కన్‌ఫర్మేషన్ ఇంకా రాలేదు, కానీ ఒక కొత్త పోస్టర్ ని అయితే ఇవాళ అధికారికంగా రిలీజ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *