They Call Him OG OTT

తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ తాజా యాక్షన్ డ్రామా “They Call Him OG” ఇప్పుడు థియేటర్ల తర్వాత త్వరలోనే OTTలోకి రానుంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

సుజీత్ దర్శకత్వంలో, DVV ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ క్రైమ్ డ్రామాలో పవన్ కళ్యాణ్ “OG” (ఓజస్ గంభీర) పాత్రలో మెరిసారు. బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హాష్మి ఈ సినిమాతో తన తెలుగు ఎంట్రీ ఇచ్చాడు. సినిమా థియేటర్లలో 2025 సెప్టెంబర్ 25న విడుదలై భారీ కలెక్షన్లు సాధించింది.

OTT విడుదల వివరాలు

OTT ప్లాట్‌ఫామ్: Netflix

OTT రిలీజ్ తేదీ: 2025 అక్టోబర్ 23

లభ్యమయ్యే భాషలు: తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం

Netflix ఇప్పటికే ఈ సినిమాకి డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. థియేటర్లలో విజయవంతమైన రన్ తర్వాత, సినిమా ఇప్పుడు అన్ని భాషల్లో Netflixలో అందుబాటులోకి రానుంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులు దాదాపు ₹90 కోట్లకు పైగా అమ్ముడైనట్లు సమాచారం. కేవలం రిలీజ్ అయినా ఒక నెలలోనే థియేటర్ల నుండి OTTకి రావడం మరో ప్రత్యేకత.

పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ కావడం వలన, Netflixలో కూడా అన్ని రీజినల్ భాషల్లో విడుదలవుతోంది. థియేటర్‌లో చూడలేని వారు, అక్టోబర్ 23 నుండి Netflixలో ఈ సినిమాను చూడవచ్చు. తెలుగు వెర్షన్‌తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా చూడొచ్చు.

పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు, యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి కూడా They Call Him OG తప్పక చూడాల్సిన సినిమా. భారీ బడ్జెట్, ప్యూర్ యాక్షన్, పవర్‌స్టార్ స్టైల్ అన్ని అద్దిరిపోయే సినిమా ఇది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *