Kaantha Movie Review

దుల్కర్ సల్మాన్ నటించిన “కాంత” చిత్రం ప్రేక్షకుల్లో మంచి అంచనాలను రేకెత్తించినప్పటికీ, విడుదల తర్వాత స్పందనలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, దుల్కర్ సల్మాన్ మరియు ప్రధాన నటీనటుల నటనకు ప్రశంసలు దక్కుతున్నప్పటికీ, సినిమా యొక్క మొత్త నిర్మాణం, నడక, స్క్రీన్‌ప్లే మాత్రం బలపడలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నారు.

దుల్కర్ సల్మాన్ సినిమాలో కనిపించే ప్రతి సన్నివేశంలోనూ తన విభిన్న స్టైల్‌ మరియు ఎమోషనల్ రేంజ్‌ చూపించాడు. పాత్రకు కావాల్సిన తీవ్రత, నిశ్శబ్దం, భావోద్వేగం ఇవన్నీ అతడి నటనలో బాగా ప్రతిఫలించాయి.

అలాగే సముద్రఖని, భాగ్యశ్రీ కూడా తమ ప్రతిభ చూపించిన ఈ సినిమాలో, సపోర్టింగ్ క్యాస్ట్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే, మంచి నటన ఉన్నా కథనం బలం లేకపోతే సినిమా నిలబడటం కష్టం అవుతుంది, ఇదే పరిస్థితి కాంత కు వర్తిస్తుంది.

“కాంత” లో ప్రధాన కథ ఆసక్తికరమైనదే. అయితే కథను చెప్పే తీరు, ముఖ్యంగా రెండో భాగంలో, బాగా నెమ్మదించడం సినిమాకు పెద్ద లోపంగా మారింది. కొన్ని సన్నివేశాలు అనవసరంగా సాగదీసినట్లుగా ఉంటాయి. కథలో నాటకీయత చూపించే ప్రయత్నం ఎక్కువ అవడం, ఇవన్నీ చివరకు సినిమాను అసమంజసంగా, సరిగా కూర్చని డ్రామా గా మార్చేశాయి.

సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షన్ అన్ని విభాగాలు మంచి పని చేశాయి. ప్రత్యేకంగా, విజువల్ టోన్‌కు దర్శకుడు ఇచ్చిన నలుపు-గోధుమ టెక్స్చర్ సినిమాకు ప్రత్యేకత తెచ్చింది. కానీ టెక్నికల్ క్వాలిటీ ఉన్నప్పటికీ, కథనం అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ఆ ప్రభావం పూర్తిగా పడలేదు.

దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ, దానిని ప్రెజెంట్ చేసే విధానంలో స్పష్టత తగ్గింది. రెండవ సగం ఏదో వేరే సినిమా చుస్తున్నామా అని అనిపించక మానదు. ఈ అసమతౌల్యం వల్ల సినిమా ఇంపాక్ట్ సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది.

దుల్కర్ అభిమానులు ఆయన నటనను మాత్రమే చూసే కోణంలో సినిమా ఆస్వాదించవచ్చు. కానీ బలమైన స్క్రీన్‌ప్లే ప్రేక్షకులకు ఈ సినిమా మధ్యస్థ అనుభవానికే పరిమితమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *