
SS రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, సినిమా టీమ్ నేరుగా ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రిలీజుకు ముందే గ్లోబల్ లెవల్లో హైప్ క్రియేట్ చేయాలనే SSR వ్యూహంలో భాగంగా ఈ ప్రత్యేక ప్రమోషన్లు చేపట్టినట్లు తెలుస్తోంది.
సినిమా కాస్ట్ సభ్యులు ఇటీవల ఓ ప్రముఖ అంతర్జాతీయ ఎంటర్టైన్మెంట్ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో వారు చిత్ర కథ నేపథ్యంలో ఉన్న ఆధ్యాత్మిక టచ్, జరిగిన షూట్ అనుభవాలు, సినిమా యొక్క గ్లోబల్ అప్పీల్ గురించి వివరించారు.
ఈ ఇంటర్వ్యూ కి సంబందించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదివరకు ఏ తెలుగు సినిమాకు లేనంతలా వారణాసి టీమ్ విదేశీ మీడియాను టార్గెట్ చేయడం కొత్త ట్రెండ్‌గా మారింది.
‘వారణాసి’ సినిమా కేవలం దేశీయ మార్కెట్‌కే కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకులను చేరుకునే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. కాస్ట్ ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూ ఇవ్వడంతో సినిమా ప్రమోషన్స్ గ్లోబల్ స్టేజ్‌పై మొదటి అడుగు వేశాయి. సినిమా విడుదలకు ముందే వచ్చిన ఈ స్పందన చూస్తుంటే ‘వారణాసి’ చిత్రం భారీ హిట్ కావొచ్చని పరిశ్రమ అంతా నమ్ముతోంది.