Rudhrudu Movie Review

Rudhrudu Telugu Review: లారెన్స్ తమిళం లో కన్నా తెలుగులోనే మంచి గుర్తింపుని సాధించాడు, ఎన్నో మంచి మంచి పాటలకి కోరియోగ్రఫీ చేసాడు, ముఖ్యంగా చిరంజీవి గారికి అయితే ఎన్నో మంచి స్టెప్స్ ని అందించాడు, ఇక ఇప్పుడు ఇటు హీరో గా దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు ని తెచ్చుకున్నాడు. ఇక తన తాజా చిత్రం రుద్రుడు ఈరోజు విడులైంది, ట్రైలర్ చూసాక మాస్ మసాలా కమర్షియల్ చిత్రం లా అనిపించినా ఈ చిత్రం ఎలా ఉందొ మన రివ్యూ లో తెలుసుకుందాం.

Rudhrudu Movie Review

 

కథ

రుద్రుడు (రాఘవ లారెన్స్) తన కుటుంబంతో సంతోషంగా ఉంటాడు, ఇక చూడగానే అనన్య (ప్రియా భవాని శంకర్) ని ప్రేమలో పడతాడు, పెళ్లి కూడా చేసుకుంటారు. కొత్త జీవితం బాగా ఉంది అనుకున్న సమయంలో అనన్యం ని ఎవరివో చంపేస్తారు, ఇక రుద్రుడి తనని మర్చిపోలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు, కానీ తన భార్య చంపినా వారి మీద పాగా తొర్చుకోవాలని వేట మొదలు పెడ్తాడు. అసలు అఞ్ఞన్య చంపించి ఎవరు? ఎందుకు చంపారు అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

రుద్రుడు మూవీ నటీనటులు

రాఘవ లారెన్స్, ప్రియా భవానీ, శరత్ కుమార్, తదితరులు నటించగా , ఈ చిత్రానికి కతీర్‌సేన్ దర్శకత్వం వహించారు, జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా, ఆర్‌డి సినిమాటోగ్రఫీ అందించారు. రాజశేఖర్ మరియు కతిరేసన్ ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ LLP బ్యానర్‌పై నిర్మించారు.

సినిమా పేరు రుద్రుడు
దర్శకుడు కతిరేసన్
నటీనటులు రాఘవ లారెన్స్, ప్రియా భవానీ, శరత్ కుమార్, తదితరులు
నిర్మాతలు కతిరేసన్, రాజశేఖర్
సంగీతం జివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ ఆర్‌డి
ఓటీటీ రిలీజ్ డేట్ ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ధ్రువీకరించలేదు

రుద్రుడు సినిమా ఎలా ఉందంటే?

రుద్రుడు చిత్రం ఎప్పుడు పాతకాలంలో చుసిన చిత్రంలా అనిపిస్తుంది తప్ప ఎక్కడ కొత్తదనం అనేది కనిపించదు. మొదటి సగం రొటీన్ లవ్ ట్రాక్ తో, రెండు మూడు ఫైట్స్ తో ఒకటి రెండు పాటలతో ముగిసిపోతుంది. తరువాయి భాగం ఇక బోరింగ్ సన్నివేశాలతో, ముగుస్తుంది. ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ ఏమైనా ఉంది అంటే అదో లారెన్స్ డాన్స్ మాత్రమే. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒక మూస కమర్షియల్ ఫోరమ్స్ లో వెళ్తూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.

లారెన్స్ ఉన్నంతలో పర్వాలేదు, యాక్షన్ సన్నివేశాల్లో బాగా చేసాడు, ప్రియా భవాని శంకర్ నటించడానికి ఎం లేదు, కొన్ని సన్నివేశాలు మరియు పాటలకి మాత్రమే పరితం చేసారు, ఇక శరత్ కుమార్ తనదైన నటనతో మెప్పించారు. ఇక మిగిలిన తారాగణం తమ పాత్రల మేరకు బాగా చేసారు.

కతిరేసన్ ఒక మూస కథతో ప్రేక్షకులని ఏ మాత్రం ఎంగేజ్ చేయలేక పోయాడు. సాంకేతికంగా రుద్రుడు పర్వాలేదు, ఆర్ డి ఛాయాగ్రహనమ్ ఓకే, జి వి ప్రకాష్ కుమార్ పాటలు పర్వాలేదు మరియు నేపధ్య సంగీతం కూడా పర్వాలేదు.

చివరగా, రుద్రుడు, రొటీన్ మాస్ మసాలా కమర్షయిల్ చిత్రం.

ప్లస్ పాయింట్లు:

  • పతాక సన్నివేశాలు

మైనస్ పాయింట్లు:

  • రొటీన్ కథనం

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *