Ramabanam Movie Telugu Review

Ramabanam Movie Telugu Review: గోపీచంద్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు, చిత్రం ఎలంటిది ఐన ఆయన మార్కు యక్షాన్ ఉండాల్సిందే. ఇప్పుడే ఇదే గోపీచంద్ కి హిందీ లో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసింది. ఇక రామబాణం తో మనం ముందుకు వచ్చినా గోపీచంద్, హిందీ లో కూడా బి౪యు వాళ్ళు ఈ చిత్రాన్ని పెద్దగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

Ramabanam Movie Telugu Review

కథ

 

రామబాణం మూవీ నటీనటులు

గోపీచంద్, జగపతి బాబు, కుష్బూ సుందర్, డింపుల్ హయతి, తరుణ్ రాజ్ అరోరా, నాజర్, శుభలేఖ సుధాకర్, సచిన్ ఖేడేకర్, కాశీ విశ్వనాథ్, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది శ్రీవాస్, సంగీతం మిక్కీ జె మేయర్, ఛాయాగ్రాణం వెట్రి పళనిసామి, ఇక ఈ చిత్రాన్ని టి జి విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు.

సినిమా పేరు రామబాణం
దర్శకుడు శ్రీవాస్
నటీనటులు గోపీచంద్, జగపతి బాబు, కుష్బూ సుందర్, డింపుల్ హయతి, తదితరులు
నిర్మాతలు టి జి విశ్వ ప్రసాద్
సంగీతం మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ వెట్రి పళనిసామి
ఓటీటీ రిలీజ్ డేట్ ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ధ్రువీకరించలేదు

రామబాణం సినిమా ఎలా ఉందంటే?

రామబాణం, మరొక లౌక్యం లాగ అనిపిస్తుంది తప్ప, ఎక్కడ కూడా కొత్త సినిమా లాగ అనిపించదు. లౌక్యం కూడా శ్రీవాస్ దర్శకత్వం లో గోపిచంద్ నటించిన చిత్రం అవ్వడం విశేషం. రామబాణం చిత్రం ప్రారంభం నుంచి, ఒక కమర్షియల్ ఫార్మటు లో వెళ్తుంది, హీరో ఇంట్రో, లవ్ వైరక్, కామెడీ ఫైట్స్ ఇలా అన్ని కలిపితే ఈ రామబాణం.

ఇక రెండవ భాగం లో కథ ఏ దిశగా వెళ్తుంది అనేది సగటు ప్రేక్షకుడికి ఇట్టే అర్థమై పోతుంది, ఇక కథ ఎలా ఉన్నప్పటికీ, గోపీచంద్, తన నటనతో, కామెడీ తో , ముఖ్యం గా తన యాక్షన్ తో తన ఫాన్స్ నే కాదు, సినీ ప్రేక్షకులని కూడా మెప్పించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కొత్తగా నటించడానికి ఏ మాత్రం స్కోప్ లేని పాత్రలో గోపీచంద్ అవలీల గ చేస్కుంటూ వెళ్ళిపోయాడు, ఇక తన గత చిత్రాల కంటే ఈ చిత్రం చాల బాగా కనిపించాడు. డింపుల్ హయతి నటించడం లో పూర్తిగా ఫెయిల్ అయ్యిందని చెప్పొచ్చు, కొంత వరకు గ్లామర్ గా కనిపించిన, స్క్రీన్ పైన తన ఓవర్ మేక్ అప్ చాల ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఇక మిగతా నటి నటులు తమ పాత్రల మేరకు బాగానే చేసారు.

శ్రీవాస్ కథ అంతగా కొత్తగా లేకపోయినా, తాను లౌక్యం ఫార్మటు నే అనుసరించాడు. ఇక కథనం ఇంకా మెరుగ్గా వ్రాసుకోవాల్సింది, మరి సగటు ప్రేక్షకుడు నెక్స్ట్ ఎం జరుగుతుందో చెప్పేయడం ఒక విదంగా బాధాకరం, అయితే ఏది ఏమైనప్పటికి, కామెడీ తో ప్రేక్షకులని ఎంగేజ్ చేయడం లో విజయం సాధించాడని చెప్పొచ్చు.

సాంకేతికంగా రామబాణం ఉన్నతంగా ఉంటుంది, మిక్కీ జె మేయర్ రెండు పాటలు బాగున్నాయి ఇక కమర్షియల్ చిత్రాలకి నేపధ్య సంగీతం చేయడం పెద్దగా లావాటు లేని మిక్కీ జె మేయర్ అంత ఇంప్రెస్సివె గా ఇవ్వలేకపోయాడు. వెట్రి పళనిసామి ఛాయాగ్రహణం సినిమాని మరో మెట్టుకి తీసుకెళ్లాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మొత్తం మీద, రామబాణం రెగ్యులర్ గోపించంద్ చిత్రం.

 

ప్లస్ పాయింట్లు:

  • కామెడీ
  •  యాక్షన్

మైనస్ పాయింట్లు:

  • రొటీన్ కథ
  • ఉహించదగిన కథనం

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *