Happy Bhogi 2023 Wishes, Quotes: భోగి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలలో సంక్రాంతి సంబరాలలో మొదటి రోజు. భోగి 2023 తేదీ జనవరి 14. ఇది TTD పంచాంగం మరియు రాష్ట్ర ప్రభుత్వ క్యాలెండర్లో జనవరి 14, 2023న గుర్తించబడింది. తెలుగు, తమిళ సంస్కృతులలో భోగి పండుగను ఒకే రోజు జరుపుకుంటారు. రోజులో ఒక ప్రధాన కార్యకలాపం చెడు లేదా ఉపయోగం లేని అన్ని వస్తువులను కాల్చడం – ఒక విధమైన ప్రక్షాళన వేడుక.
ప్రతి సంవత్సరం, ప్రజలు భోగి పండగ రోజున పని చేయని పాతవి ఉపయోగించని వస్తువులను మరియు పాడైపోయిన వస్తువులను భోగి మంటల్లో కాల్చేస్తారు. . భోగి ఆచారంలో భాగంగా, ప్రజలు పొద్దున్నే స్నానం చేసి కొత్త సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. రంగోలీలు డైనమిక్ రంగులతో తయారు చేయబడతాయి మరియు కోలం అని పిలువబడే గుమ్మడి పువ్వులను ఇళ్ల ముందు తయారు చేస్తారు. “గొబ్బెమ్మ,” అనగా తాజా ఆవు పేడను కూడా రంగోలి డిజైన్లను అలంకరించేందుకు ఉంచుతారు. అలంకరణపై మట్టి దీపాలను కూడా ఉంచవచ్చు. పొంగల్ మొదటి రోజున నిర్వహించబడే మరో ముఖ్యమైన సంప్రదాయం “భోగి మంటలు”. కలప మరియు ఇతర ఘన ఇంధనాలతో భోగి మంటలను వెలిగించడం ద్వారా ఇది అమలు చేయబడుతుంది.
Happy Bhogi 2023 Wishes, Quotes
Happy Bhogi 2023 Wishes
మీలోని చెడును, దురలవాట్లను,
చెడు సావాసాలను భోగి మంటల్లో వేసేయండి.
జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించండి.
భోగి పండుగ శుభాకాంక్షలు!
నూతన ప్రారంభానికి ఒక శుభ దినం..
అదృష్టాన్ని, భోగ భాగ్యాలను ప్రసాదించే పర్వదినం..
మీ కుటుంబం సుఖసంతోషాలతో..
సిరిసంపదలతో సుసంపన్నంగా విరజిల్లాలని ఆకాంక్షిస్తూ..
భోగి శుభాకాంక్షలు!
కీర్తనలు పాడే హరిదాసులు..
నింగిని తాకే పతంగులు..
పలనాడులో కోళ్ల పందేలు..
చిందులువు వేసే బసవన్నలు..
సంక్రాంతి మూడు దినాలు..
చూడతరమా పల్లె అందాల సోయగాలు
అందరికీ భోగి శుభాకాంక్షలు
కష్టాలను దహించే భోగి మంటలు..
భోగాలను అందించే భోగి పండ్లు..
అల్లుళ్లకి స్వాగతం పలికే తోరణాలు..
ధాన్యపు రాసులతో నిండిన గదులు..
ముంగిలో అందమైన రంగవల్లులు..
గోపికలను సూచించే గొబ్బెమ్మలు..
ఘుమఘుమలాడే పిండి వంటలు..
ఇంటికొచ్చే పాడిపంటలు,
కమ్మనైన పిండివంటలు, చలికాచే భోగి మంటలు,
సంతోషంగా కొత్త జంటలు, ఏటేటా సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతి
అందరికీ భోగి శుభాకాంక్షలు.
భోగి మంటలతో మీ సమస్యలన్నీ మటుమాయం కావాలి. మీ ఇంట భోగభాగ్యాలు రావాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలుభోగి సందర్భంగా మీ జివితంలో సరికొత్త కాంతులు రావాలి. మీకు భోగి శుభాకాంక్షలు
ఈ భోగి మీకు భోగభాగ్యాలు కలిగించాలి. సంక్రాంతి సుఖసంతోషాలు ఇవ్వాలి. కనుమ కమనీయ అనుభూతులు మిగల్చాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు
భోగి, సంక్రాంతి, లోహ్రీ, పొంగల్ సందర్భంగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబం ఈ పండుగలను ఆనందంగా జరుపుకోవాలి.
Happy Bhogi 2023 Quotes
ఇంటికొచ్చే పాడిపంటలు,
కమ్మనైన పిండివంటలు, చలికాచే భోగి మంటలు,
సంతోషంగా కొత్త జంటలు,
ఏటేటా సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతి
అందరికీ భోగి శుభాకాంక్షలు.
గతానికి వీడ్కోలు పలుకుతూ
రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలికే
భోగి పండుగ సందర్భంగా
అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.
ఈ భోగి పండుగ మీ ఇంట
సంబరాల కాంతిని తీసుకురావాలని,
కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ
అందరికీ పండుగ శుభాకాంక్షలు.
నిన్నటి బాధలను భోగిమంటల్లో కాల్చేసి
కాంతిని పంచగా వచ్చిన సంక్రాంతిని
నీలో దాచేయాలని కోరుకుంటూ
అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.
భోగి సందర్భంగా మీ జివితంలో సరికొత్త కాంతులు రావాలి. మీకు భోగి శుభాకాంక్షలు.
కష్టాలు, బాధలు భోగి మంటలతో పోవాలి. కొత్త ఆనందాలు, సంతోషాలు వెల్లివిరియాలి. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు..
భోగభాగ్యాల భోగి మీకు మరిన్ని ఆనందాలు పంచాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు.
ఆ పతంగులు ఆకాశానికి సరికొత్త రంగులు అద్దినట్లు… ఈ భోగి పండుగ మీ జీవితంలో సరికొత్త ఆనందాలు తేవాలి. హ్యాపీ భోగి ఫెస్టివల్.
మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని మీ మిత్రులకి , కుటుంభ సంభ్యులకి మరియు శ్రేయోభిలాషులకు మీ భోగి శుభాకాంక్షలు తెలపండి.