Republic Day Wishes, Quotes, Messages, Status, Images: గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

Republic Day Wishes, Quotes, Messages, Status, Images: భారతదేశం తన రాజ్యాంగాన్ని జనవరి 26, 1950న ఆమోదించిన రోజు గుర్తుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. ఇది ఆగష్టు 15, 1947న బ్రిటీష్ పాలన అంతమైనందుకు గుర్తుచేసే స్వాతంత్య్ర దినోత్సవానికి భిన్నంగా ఉంటుంది.

రాజ్యాంగం, ప్రపంచంలోని పొడవైన మరియు అత్యంత వివరణాత్మకమైనది, BR అంబేద్కర్ చేత రూపొందించబడింది మరియు ఇది భారతదేశాన్ని ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మరియు రాష్ట్రాల యూనియన్‌గా స్థాపించింది. చివరికి జనవరి 26, 1950న అమలులోకి రావడానికి ముందు ఈ ముసాయిదా బహిరంగంగా చర్చించబడింది మరియు రెండు సంవత్సరాలు సర్దుబాటు చేయబడింది.

ఈ సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో గొప్ప ప్రదర్శనతో దేశంలోని అన్ని నగరాల్లో జరుపుకుంటారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ రాష్ట్రపతి భవన్ (ఇది రాష్ట్రపతి నివాసం) నుండి మొదలై ఇండియా గేట్ వరకు సాగుతుంది. హాజరైన ప్రతి ఒక్కరూ జాతీయ గీతం – జన గణ మన ఆలపించేటప్పుడు భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దీని తర్వాత ఇండియన్ ఆర్మీ రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీ ద్వారా 21 గన్ సెల్యూట్ జరుగుతుంది.

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ (Republic Day Wishes, Quotes, Messages, Status, Images)

మూడు రంగుల జెండా.. ముచ్చటైన జెండా
భారతీయుల జెండా.. బుహు గొప్పదైన జెండా
అందరూ మెచ్చిన జెండా.. ఆకాశంలో ఎగిరే జెండా
అంధకారం పోగొట్టిన జెండా.. ఆశలు మనలో రేపిన జెండా..
– అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం మరియు స్వాతంత్య్ర సమరయోధుల కీర్తిని చూసి ఆనందించండి. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు వందేమాతరం శుభాకాంక్షలు.

మాతృభూమి కోసం..
తమ ధన, మాన ప్రాణాలను..
త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులకు..
వందనం.. అభివందనం.. పాదాభివందనం.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Happy Republic Day

నేను భారతీయుడినైనందుకు గర్విస్తున్నాను..
సదా నేను భారతమాతకు రుణపడి ఉంటాను..
భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారతమాతకు జేజేలు..’
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం.
శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Happy Republic Day

మీకు 2023 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! మనకు స్వాతంత్య్ర ఇవ్వడానికి తమ జీవితాలను త్యాగం చేసిన భారతదేశ నిజమైన హీరోల గురించి ఈ రోజు కొంత సమయం గడుపుదాం.

స్వాతంత్య్రం, స్వేచ్ఛ అంటే ఎంజాయ్‌ చేయడం కాదు.
దాన్ని అర్థం చేసుకోవాలి. గౌరవించాలి. రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి.
ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచడమే దేశమాతకు మనమిచ్చే ఘనమైన నివాళి.
స్వాతంత్య్ర సమరయోధులు కలగన్న భారత్‌ను నిర్మించుకుందాం.
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

నింగికెగసిన స్వరాజ్య నినాదం..
భరతమాత చేతిలో..
రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
సకల భారతావని ఆనంద సంబరం
గణతంత్ర దినోత్సవం
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Happy Republic Day

ఆలోచనా స్వేచ్ఛ, మన విశ్వాసాలలో బలం మరియు మన వారసత్వం పట్ల గర్వం. గణతంత్ర దినోత్సవం నాడు మన వీర అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

న దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం.
శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం.
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

 దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము..
అందరికీ…
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మాతృభూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు. అందరికీ వందనాలు.
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటితరం..
భారతీయతను బలంగా మార్చుకుంది నేటి తరం..
భారతీయతని సందేశంగా పంపుదాం మనం.. తరం తరం.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Happy Republic Day

దేశం మనదే తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే.. ప్రజల అండదండా మనదే
ఎన్ని భేదాలున్నా.. మాకెన్ని తేడాలున్నా..
దేశమంటే ఏకమౌతాం అంతా ఈవేళ..
వందేమాతరం.. అందాం మనమందరం..
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మెసెజెస్ (Republic Day Wishes Messages)

అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..
జరుపుకుందాం ఈ గణతంత్ర దినోత్సవ పండుగను మెండుగా కన్నుల పండుగగా..!!
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

‘నేను భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నా..
ఎల్లప్పుడూ నేను భారతమాతకు రుణపడి ఉంటా..
భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారతమాతకు జేజేలు’
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

మన మనస్సులో నిష్కల్మషం, మన మాటల్లో పదును, మన రక్తంలో స్వచ్ఛత, మన గుండెల్లో ధైర్యం, మన ఆత్మలలో భారతీయులమనే గర్వం, ఇవన్నీ మనకందించిన భరతమాతకు వందనం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

‘ప్రతి గురువు ఈ దేశాన్ని
ఎలా ప్రేమించాలో విద్యార్థులకు నేర్పించాలి..
తల్లిదండ్రులు కూడా పిల్లలకు దేశం గురించి చెప్పాలి..
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

ఈ ప్రత్యేకమైన రోజున, మన స్వరాజ్య కర్తలు మనకందించిన స్వేచ్ఛను, విలువలను సంరక్షిస్తామని, భావితరాల శ్రేయస్సుకు తోడ్పడతామని మాతృభూమి సాక్షిగా వాగ్ధానం చేద్దాం. హ్యాపీ రిపబ్లిక్ డే 2023

ఎన్నో ఏళ్లుగా బానిసత్వం, స్వాతంత్ర యోధుల బలిదానంతో సిద్ధించింది ఈ స్వరాజ్యం, మన స్వేచ్ఛా వాయువుల కోసం, వేల మంది  వదిలారు తమ శ్వాసం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

‘మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు..
మనకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిన ఈ రోజే గణతంత్ర దినోతవ్సం..
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

స్వేచ్ఛకు ఉన్న నిజమైన అర్థమేంటో తెలుసుకుందాం.
మన దేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుదాం.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

జగతి సిగలో జాబిలమ్మకు వందనం..
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం..
మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి..
కలికి పదములు కడలి కడిగినర కళ ఇది.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కోట్స్ (Republic Day Wishes Quotes)

మనసులో స్వేచ్ఛ మాటల్లో బలం
మన రక్తంలో స్వచ్ఛత గణతంత్ర
దినోత్సవం సందర్భంగా
అమరవీరులకు వందనం చేద్దాం
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

సిరులు పొంగిన జీవగడ్డై..
పాలు పారిన భాగ్యసీమై..
రాలినది ఈ భారతఖండం..
భక్తితో పాడరా సోదరా..
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఇంత గొప్ప చరిత్ర మరియు వారసత్వం ఉన్న
దేశంలో మీరు నివసిస్తున్నందుకు గర్వపడండి
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

‘ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా..
మన సమరయోధులను స్మరించుకుందాం..
మన వారసత్వాన్ని కాపాడుకుందాం..
మన దేశాన్ని చూసి గర్వపడదాం..’
మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..

ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఆంగ్లేయుల చెర నుంచి భారత్‌ను విడిపించిన..
స్వాతంత్య్ర సమరయోధుల కృషి అసాధారణమైనది.
వారి త్యాగాలని గణతంత్ర వేడుక సందర్భంగా స్మరించుకుందాం.
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇమేజస్ (Republic Day Wishes Images)

Republic Day Wishes, Quotes, Messages, Status, Images

Republic Day Wishes, Quotes, Messages, Status, Images

Republic Day Wishes, Quotes, Messages, Status, Images

Republic Day Wishes, Quotes, Messages, Status, Images

Republic Day Wishes, Quotes, Messages, Status, Images

Republic Day Wishes, Quotes, Messages, Status, Images

Republic Day Wishes, Quotes, Messages, Status, Images

Republic Day Wishes, Quotes, Messages, Status, Images

Republic Day Wishes, Quotes, Messages, Status, Images

Republic Day Wishes, Quotes, Messages, Status, Images

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్టేటస్ (Republic Day Wishes Status)

పైన మీకు అందించిన విషస్, మెసెజస్, కోట్స్, ఇమేజస్, స్టేటస్ లలో మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని మీ మిత్రులకి , కుటుంబ సభ్యులకి మరియు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. – అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్ భారత్ మాత కి జై.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles