
2025 మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత మహిళా జట్టు అద్భుతమైన రికార్డు చేజ్‌ను సాధించి, ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ భారత మహిళా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. ఒత్తిడి మధ్య ఆత్మవిశ్వాసంతో ఆడిన భారత ఆటగాళ్లు మరోసారి దేశం గర్వపడేలా చేశారు.
ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 338 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఫీబీ లీచ్ఫిల్డ్ (119), ఎలీస్ పెర్రీ (77), ఆష్లేయ్ గార్డనర్ (63) అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాను బలమైన స్థితిలో ఉంచారు
అయితే భారత జట్టు సమాధానంగా అద్భుతమైన ఆటతీరుని కనబరచారు. జెమిమా రౌద్రిగ్స్ (127 పరుగులు, 134 బంతుల్లో) మరియు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89 పరుగులు, 88 బంతుల్లో) అద్భుతమైన భాగస్వామ్యం చూపారు. ఇద్దరి భాగస్వామ్యం తర్వాత యువ ఆటగాళ్లైన రిచా ఘోష్ చివరి ఓవర్లలో సునాయాసంగా బౌండరీ లు కొట్టి ఆట ముగించి భారత్‌ను తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే విజయం వైపు నడిపించారు.
జెమిమా కి వచ్చిన అవకాశాన్ని వాడుకుని అద్భుత ప్రదర్శనతో భారత మహిళా జట్టుని ఫైనల్ కి తీసుకెళ్లింది. అలాగే హర్మన్‌ప్రీత్ ఒత్తిడి సమయంలో శాంతంగా ఆడి జట్టును గమ్యానికి చేర్చింది.
ఈ విజయంతో భారత మహిళా జట్టు ప్రపంచకప్ సెమీఫైనల్‌లో 330 పరుగులకు పైగా చేజ్ చేసిన మొదటి జట్టుగా నిలిచింది. ఈ విజయంతో భారత మహిళా క్రికెట్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది — ఇది కేవలం విజయం మాత్రమే కాదు, భారత మహిళల ధైర్యం, క్రమశిక్షణ, మరియు ప్రతిభకు నిదర్శనం.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ –
“మేము మొదటినుండే విశ్వాసంతో ఆడాము. భయంలేకుండా ఆడటమే మాకు విజయం అందించింది.”
భారత జట్టు ఇప్పుడు దక్షిణాఫ్రికా తో ఫైనల్‌లో తలపడనుంది. దేశవ్యాప్తంగా అభిమానులు ఇప్పటికే ఈ విజయం పట్ల ఆనందంతో సంబరాలు జరుపుతున్నారు. ఆదివారం నాడు జరిగే ఫైనల్ కోసం అందరూ ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు.