
థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన తర్వాత, లోకః చాప్టర్ 1: చంద్ర ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఈ మలయాళ సూపర్‌హీరో సినిమాను డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా, దుల్కర్ సల్మాన్ నిర్మించారు. ప్రధాన పాత్రలో కల్యాణి ప్రియదర్శన్ నటించారు.
ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్, మిథాలజీ మరియు మోడ్రన్ ఫాంటసీ కలయికతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ లోకః చాప్టర్ 1: చంద్ర సినిమా ఆగస్ట్ 28, 2025న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుండి విశేష స్పందన పొందింది.
ఈ చిత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాలలో ఒకటిగా నిలిచింది. సుమారు ₹300 కోట్ల మార్క్ దాటిందని సమాచారం.
అధికారిక ప్రకటన ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులు JioCinema (JioHotstar) సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 31, 2025 నుండి ఈ సినిమా OTT లో స్ట్రీమింగ్ కి సిద్ద్ధంగా ఉంది. ఒకేసారి మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, మరియు మరాఠీ భాషల్లో స్ట్రీమ్ అవుతుంది.
భారతదేశ ఓటీటీ విడుదల తర్వాత, ఈ చిత్రం యూఏఈ, సింగపూర్, అమెరికా వంటి దేశాల్లోని అంతర్జాతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్ములలో కూడా అందుబాటులోకి రానుందని సమాచారం.
ఈ సినిమా విజువల్స్, కథన పద్ధతి మలయాళ సినిమాకు కొత్త మైలురాయిగా నిలిచాయి. కల్యాణి ప్రియదర్శన్ నటనకు విపరీతమైన ప్రశంసలు లభించాయి. ఇది ఒక పెద్ద సూపర్‌హీరో యూనివర్స్‌కు మొదటి భాగం కావడంతో, తదుపరి చాప్టర్లపై ఆసక్తి పెరిగింది.
సినిమా పేరు: లోకా చాప్టర్ 1: చంద్ర
దర్శకుడు: డొమినిక్ అరుణ్
నిర్మాత: దుల్కర్ సల్మాన్
ప్రధాన పాత్ర: కల్యాణి ప్రియదర్శన్
థియేటర్ విడుదల: ఆగస్ట్ 28, 2025
ఓటీటీ విడుదల: అక్టోబర్ 31, 2025
ప్లాట్‌ఫారమ్: JioHotstar
భాషలు: మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ.