
2022లో వచ్చిన బ్లాక్‌బస్టర్ కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: ఛాప్టర్ 1’ థియేటర్లలో ఘన విజయాన్ని సాధించింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమా, అక్టోబర్ 2, 2025న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా 900 కోట్ల గ్రాస్ కలెక్షన్ లతో సత్తా చాటుతోంది.
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలోనే డిజిటల్‌గా స్ట్రీమ్ కానుంది. అధికారికంగా ఈ సినిమా అక్టోబర్ 31, 2025 నాడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కు వస్తుంది.
కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, కాంతార: ఛాప్టర్ 1 డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సుమారు ₹125 కోట్లు విలువైన భారీ డీల్‌తో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
OTT ప్లాట్‌ఫాం: Amazon Prime Video
OTT రిలీజ్ డేట్: అక్టోబర్ 31, 2025
భాషలు: కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ
సినిమా థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాత OTTలోకి రావడం కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ప్రేక్షకులకి మాత్రం ఇది మంచి వార్తే అని చెప్పాలి. బాక్సాఫీస్ రన్ బలంగా కొనసాగుతున్న కూడా అప్పుడే స్ట్రీమింగ్ కి రావడం ఒక రకంగా సినిమా నిర్మాత కి షాక్.
సినిమా ఇప్పటికీ దేశవ్యాప్తంగా థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతోంది.
కాంతార: ఛాప్టర్ 1 కథ కాంతార (2022) లో చూపించిన ఫోక్‌లొర్ మూలాలను అన్వేషిస్తుంది. పురాతన కాలంలో సాగే ఈ కథలో మానవుడు మరియు దేవత్వం మధ్య ఉన్న మాయాజాలాన్ని అద్భుతంగా చూపించారు.
రిషబ్ శెట్టి ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం, తన అద్భుతమైన విజువల్స్, ఘనమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మరియు తీర ప్రాంత కర్ణాటక సంస్కృతిని ప్రతిబింబించే నాటకీయతతో ప్రశంసలు అందుకుంది.