
పాకిస్తాన్ మాజీ ప్రధాని Imran Khan గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మరణ వదంతులు బాగా వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు Kasim Khan మీడియా ముందు వచ్చి పెద్ద వ్యాఖ్యలు చేశాడు.
కాసిమ్ ఖాన్ మాట్లాడుతూ, “మేము గత కొన్ని వారాలుగా నాన్నగారితో మాట్లాడలేకపోతున్నాం. జైలు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.
నాన్న బాగానే ఉన్నారా? బతికే ఉన్నారా? అన్నది తెలుసుకోవాలి.”
అలాగే ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడు అని తెలిసేలా “Proof of Life” ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
పాకిస్తాన్ జైలు అధికారులు మాత్రం ఈ వార్తలు “పూర్తిగా అబద్ధం” అని చెప్పారు.
వారి ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ బాగానే ఉన్నారు, ఆరోగ్యంలో ఎలాంటి సమస్య లేదు, ఆయనకు అవసరమైన సౌకర్యాలు ఇస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.
కాసిమ్ మాత్రం ఈ మాటలను నమ్మడం లేదు, ఎందుకంటే ఆయన తన తండ్రిని పర్సనల్‌గా చూడలేకపోతున్నాడు.
సోషల్ మీడియా, ఇంటర్నెట్, న్యూస్ ఛానల్స్‌లో ఒకే ప్రశ్న చర్చలో ఉంది: “ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ?”, “అతను నిజంగా బాగానే ఉన్నాడా?”
ప్రజలు పారదర్శకత కోరుతున్నారు, అంతర్జాతీయ సంస్థలకూ ఈ విషయం లో కలగజేయమని కాసిమ్ కోరాడు.
ఇమ్రాన్ ఖాన్ 845 రోజులు నుంచి జైల్లో ఉన్నారు, ఇటీవల వారిని సెల్‌లో ఒంటరిగా (solitary confinement) ఉంచారని కాసిమ్ ఆరోపించాడు. కుటుంబ సభ్యులకు కలిసే అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. అందుకే మరణ వదంతులు పెరిగాయి.