Vidudhala Part 1 Movie Review

Vidudhala Part 1 Telugu Review: తమిళ్ లో కమెడియన్ గా మంచి పేరు ఉన్న సూరి మరియు విజయ్ సేతుపతి నటించిన చిత్రం విడుతలై పార్ట్ 1 , ఈ చిత్రం తమిళ్ లో మంచి విజయం సాధించింది, అయితే ఈ చిత్రాన్ని తమిళ్ తో పాటె డైరెక్ట్ గా తెలుగు లో కూడా రీలాస్ చేయాల్సి ఉండే, కానీ డబ్బింగ్ లేట్ అవ్వడం వాళ్ళ, పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఇక ఎట్టకేలకు అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని విడుదల పార్ట్ 1 అనే పేరుతో విడుదల చేసారు. ఈ రివ్యూ లో ఈ చిత్రం చూడదగినదేనా తెలుసుకుందాం.

Vidudhala Part 1 Movie Review

కథ

ఆదివాసుల హక్కులకోసం పోరాడే లీడర్ ఐన పెరుమాళ్ (విజయ్ సేతుపతి ) ని పట్టు కోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక గోస్ట్ హంట్ అనే సీక్రెట్ మిషన్ ని చేపడుతుంది, అప్పుడే కొత్తగా డ్యూటీ లో జాయిన్ అయిన్ కుమార్ (సూరి) కూడా ఈ మిషన్ భాగం అవుతాడు, అయితే చివరికి పెరుమాళ్ గ్రూప్ మరియు పోలీస్ అధికారుల మధ్య అమాయకుడైన కుమ్మరి ఎలా నలిగిపోయాడు అనేది మిగిలిన కథ.

విడుదల పార్ట్ 1 మూవీ నటీనటులు

సూరి విజయ్ సేతుపతి, భవానీ శ్రీ, చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, ఇళవరసు, మున్నార్ రమేష్, శరవణ సుబ్బయ్య తదితరులు నడిచారు .వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి , ఇళయరాజా సంగీతం అందించారు , ఆర్.వెల్ రాజ్ ఛాయాగ్రహణం అందించగా, ఈ చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు.

సినిమా పేరు విడుదల పార్ట్ 1
దర్శకుడు వెట్రిమారన్
నటీనటులు సూరి విజయ్ సేతుపతి, భవానీ శ్రీ, చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, తదితరులు
నిర్మాతలు ఎల్రెడ్ కుమార్
సంగీతం ఇళయరాజా
సినిమాటోగ్రఫీ ఆర్.వెల్ రాజ్
ఓటీటీ రిలీజ్ డేట్ ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ధ్రువీకరించలేదు

విడుదల పార్ట్ 1 సినిమా ఎలా ఉందంటే?

చిత్రం ఒక భయంకరమైన ట్రైన్ అక్సిడెంట్ సన్నివేశం తో చాల ఇంట్రెస్టింగ్ గా ప్రారంభం అవుతుంది. అయితే దర్శకుడు ఎక్కువ సమయం వృధా చేయకుండా కథ మరియు దాని కాన్ఫ్లిక్ట్ ముందే చెప్పేయడంతో, ఒక అవగాహనతో ప్రేక్షకులని సిద్ధం చేస్తాడు దర్శకుడు. మొదటిసగం స్లో గా ఉన్నప్పటికీ, సగటు ప్రేక్షకుడికి నచ్చే అంశాలతో చాల బాగా ఎంగేజ్ చేస్తుంది, ఇక రెండవ సగంలో గౌతమ్ మీనన్, కుమార్ మరియు విజయ్ సేతుపతి విల్ల నటనతో ప్రేక్షకులని రెండు గంటల పాటు కూర్చోబెడతారు.

సూరి, కుమార్ పాత్రకి న్యాయం చేసాడు, ఒక కమెడియన్ అయ్యుండి ఇలాంటి సీరియస్ పాత్రని పోషించడం అభినందనీయం, ఇక విజయ్ సేతుపతి గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు, ఉన్న కాసేపే అయినా తన నటనతో మెప్పించాడు, అయితే తన పాత్ర పార్ట్ 2 లో ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, గౌతమ్ మీనన్ ఉన్నంతలో బాగా చేసాడు, ఇక మిగిలిన తారాగణం బాగా చేసారు.

వెట్రి మారన్ ఎందుకు గొప్ప దర్శకుడో ఈ చిత్రం చూస్తే అర్థమవుతుంది, తను ఎంచుకున్న పాయింట్ చిన్నదే ఐన, తెరకెక్కించిన విధానం అద్భుతం. సగటు ప్రేక్షకుణ్ణి ఎంగేజ్ చేయడంలో విజయం సాధించాడని చెప్పొచ్చు.

సాంకేతికంగా ఈ చిత్రం బాగుంది, ఛాయాగ్రహనమ్ కానీ, దానికి అనుగుణంగా అడవిలో లైటింగ్ గాన్ అన్ని ప్రేక్షకుని సినిమాతో ట్రావెల్ అయ్యేలా చేస్తాయి. ఇళయరాజా సంగీతం ఓకే కానీ నేపధ్య సంగీతం కొత్తగా ఉంది, ఇక ఆర్ వెల్ రాజ్ ఛాయాగ్రహనమ్ చాల బాగుంది.

చివరికి, విడుదల పార్ట్ 1 అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే ఇంటెన్స్ డ్రామా.

ప్లస్ పాయింట్లు:

  • నటన
  •  నేపధ్య సంగీతం
  •  ఛాయాగ్రహణం
  • వెట్రిమారన్ దర్శకత్వం

మైనస్ పాయింట్లు:

  • స్లో కథనం

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *