Virupaksha Movie Telugu Review

Virupaksha Telugu Review: సుకుమార్ దర్శకతవమ్ కాకుండా తన శిష్యులతో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పైన తాను రచించిన కథలని తెరమీదికి తీస్తుంటారు. ఇప్పుడు విరూపాక్ష అనే మిస్టికల్ థ్రిల్లర్ మన ముందుకు తెచ్చారు, ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది, మరియు విరూపాక్ష టీం బాగా ప్రమోట్ చేసారు కూడా. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఈ చిత్రం చూడదగినదా కాదా ఈ డిటైల్డ్ రివ్యూ లో తెల్సుకుందాం.

Virupaksha Movie Telugu Review

కథ

వరుస మరణాల తో ఒక పల్లెటూరి చాల సమస్యల్ని ఎదుర్కొంటుంది, అక్కడి ప్రజలు కొలిచే దేవుడు కూడా ఏమి చేయకపోయేసరికి, వచ్చే అమావాస్యకి ఊరు మొత్తమ్ వల్లకాడుఅయిపోతుంది అని భావించి, ఆలోపు ఈ మిసోరీ వెనుక ఎం ఉంది తెలుసుకోవాలని ఊరిలోకి ఎవరిని రాకుండా నిషేదిస్తారు, అయితే అప్పటికే వచ్చిన ఒక వ్యక్తి ఆ ఉరి ప్రజల్ని మరియు వరుస హత్యల వెనుక ఉన్న నిజాన్ని ఎలా కనుక్కున్నాడు అనేది కథ.

విరూపాక్ష మూవీ నటీనటులు

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, అభినవ్ గోమఠం, అజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్ మరియు ఛాయాగ్రహణం శామ్‌దత్ సైనుద్దీన్.

సినిమా పేరు విరూపాక్ష
దర్శకుడు కార్తీక్ దండు
నటీనటులు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, అభినవ్ గోమఠం, అజయ్ తదితరులు
నిర్మాతలు BVSN ప్రసాద్
సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ శామ్‌దత్ సైనుద్దీన్
ఓటీటీ రిలీజ్ డేట్ ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ధ్రువీకరించలేదు

విరూపాక్ష  సినిమా ఎలా ఉందంటే?

కన్నడ చిత్రం కాంతారా విజయం తరువాత, ఆ నేపథ్యంలో నడిచే కథల్ని తీయడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, అయితే అన్ని చిత్రాలు కాంతారా అవ్వలేవు అన్నది నిజం. ఇక ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ గా ప్రారంభం అవుతుంది, ఉరి వాతావరణాన్ని, అక్కడి ప్రజలు, వారి నమ్మకాలను, ఎక్కువ సమయం వృధా చేయకుండా మొదట్లోనే చెప్పడం బాగుంది, మరియు ఇది కథతో ముందుకు వెళ్ళడానికి సహాయ పడింది. హీరో మరియు హీరోయిన్ లైవ్ ట్రాక్ కొంచెం బోర్ అనిపించినా, మిగతా పార్ట్ అంత చాల ఇంట్రెస్టింగ్ గా అనిపించి ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది.

రెండవ సగం కథనం కొంచెం నెమ్మదిగా మొదలైనప్పటికీ, ఒక్కసారి వరుస మరణాల వెనుక ఉన్న నిజాన్ని తెల్సుకోవడాని లోతుగా వెళ్ళాక, చిత్రం చివరి వరకు మనల్ని కట్టిపడేస్తుంది. ఇక మరణాల వెనక ఉన్న కారణం మనల్ని షాక్ కి గురి చేస్తుంది.

సాయి ధరమ్ తేజ్ తన పాత్రకి న్యాయం చేసాడు, కాకపోతే ఇంకా బాగా నటించాల్సి ఉంది, సంయుక్త మీనన్ ఉన్నంతలో బాగానే చేసింది, కానీ పాత్రకి సరిపోలేదన్పిస్తుంది, ఇక మిగిలిన తారాగణం అజయ్, శ్యామల, సోనియా సింగ్ వాళ్ళ పాత్రల మేరకు బాగాన్యూ చేసారు.

సుకుమార్ అన్ని వర్గాలని ఎంగేజ్ చేసి కథని అందించగా, అంతే బాగా కార్తీక్ దండూరి తీసాడు, మొత్తానికి కథనం అక్కడక్కడా తడబడినప్పటికి, ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో విజయం సాధించాడు.
కాంతారా ఫేమ్ బి. అజినీష్ లోకనాథ్ పాటలు అంతగా ఆకట్టుకోవు కానీ నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది మరియు శామ్‌దత్ సైనుద్దీన్ ఛాయాగ్రహణం చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించింది అని చెప్పొచ్చు.

ఓవర్ అల్ గా ఈ విరూపాక్ష అన్ని రకాల ప్రేక్షకులని ఎంగేజ్ చేసి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్.

ప్లస్ పాయింట్లు:

  • ట్విస్టులు
  • నేపధ్య సంగీతం
  •  ఛాయాగ్రహణం

మైనస్ పాయింట్లు:

  • అక్కడక్కడా స్లో కథనం

సినిమా రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *