Happy Holi 2024 Wishes, Quotes, Messages, Images and Status: హోలీ భారతదేశం యొక్క శక్తివంతమైన మరియు రంగుల పండుగ. హిందూ వసంత పండుగ హోలీని రంగుల పండుగ అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశం మరియు నేపాల్‌లో జరుపుకుంటారు. ఇది జీవితం యొక్క ఉల్లాసానికి ప్రతీక. ఇది క్షమాపణ, స్నేహపూర్వకత, ఏకత్వం మరియు సమానత్వం యొక్క రోజు. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి సంబంధించిన వేడుక కూడా. హోలీని రెండు ఈవెంట్‌లుగా విభజించారు: హోలికా దహన్ మరియు ధూలివందన్ (రంగవాలి హోలీ). ధూలివందనానికి ముందు రోజు రాత్రి హోలికా దహన్ జరుగుతుంది. మంచిని ఓడించే చెడును సూచించడానికి చెక్క మరియు పేడ కేక్‌లను సింబాలిక్ ఎరలో కాల్చారు.
హోలికా దహన్ తర్వాత ఉదయం ధూళివందన్ జరుగుతుంది, ప్రజలు నీటిలో తడిసినప్పుడు రంగుల పొడిని (గులాల్) సరదాగా ఒకరిపై ఒకరు విసురుకునే సందడితో కూడిన వ్యవహారం. హోలీ సమయం చంద్రునితో సమకాలీకరించబడింది, అంటే ప్రతి వేడుక తేదీలు మారుతూ ఉంటాయి. ఇది సాధారణంగా ఫిబ్రవరి-మార్చి నెలలో వస్తుంది. కాబట్టి, హోలీ సమయం వచ్చినందున, మిమ్మల్ని మీరు వెనుకకు తీసుకోకండి మరియు ఈ అందమైన రంగుల పండుగను ఆనందించండి! ఇక్కడ మేము కొన్ని విషెస్ మరియు ఇమేజెస్ ని మీకోసం ఉంచాము కాబట్టి మీరు మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు పంపించి వారిని సంతోషపెట్టండి.
హ్యాపీ హోలీ విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ (Happy Holi Wishes, Quotes, Messages, Status, Images)
ఈ రంగుల హోలీతో మీ జీవితం.. సంబరాలమయం కావాలని ఆశిస్తూ. హ్యాపీ హోలీ.
హోలీలో ఒక్కో రంగూ మన జీవితంలోని ఒక్కో సందర్భానికి ప్రతీకలు. మీ జీవితం సుఖ సంతోషాల రంగులతో మెరిసిపోవాలి. హ్యాపీ హోలీ.
హోలీ మీకు బాగా కలిసిరావాలి. అదిరిపోయే కలర్స్ మీకు ఆనందాలు పంచాలి. రంగుల మెరుపులు మీకు శుభాలు కలిగించాలి. హ్యాపీ హోలీ.
ఈ సంవత్సరం మీ కుటుంబంలో స్వీట్ కలర్‌ఫుల్ మెమరీస్ మిగిలిపోవాలి. హ్యాపీ హోలీ.
హోలీ ప్రేమికులకే కాదు ప్రతి ఒక్కరికీ ఆనందాల పండుగే. దాన్ని ఆస్వాదించాలి. కలర్‌ఫుల్‌గా జరుపుకోవాలి.
నాకు ఒక్క రంగు పూస్తే సరిపెట్టుకోను. రంగులన్నీ నాలో నిండిపోవాలి. రంగుల్లో మునిగితేలాలి.
చీకటి ఏ రంగులూ కనిపించవు. కష్టాల్లో ఏ దారీ కనిపించదు. జీవితంలో చీకట్లను తరిమేసేలా రంగులను ఆహ్వానించాలి.
ప్రతి పండుగా మనలో రేపటిపై ఆశల్ని చిగురింపజేస్తుంది. హోలీ ఆ ఆశలను రంగులతో నింపి… మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఈ ప్రకృతి అంతా హోలీ మయమే. సూర్యోదయం, జాబిల్లి, మేఘాలు, వర్షాలు అన్నింట్లోనూ ఉన్నది రంగులే. మనలోనూ అవి నింపుకోవాలి.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఈ హోలీ. అందరికీ హోలీ శుభాకాంక్షలు.
హ్యాపీ హోలీ కోట్స్ (Happy Holi Quotes)
వసంత గమనంలో వచ్చెను రంగుల హోలీ
నింపెను మన జీవితాల్లో సంతోష కేళీ
– మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు.
సప్త వర్ణాల శోభితమైన పండుగ.. సలక్షణమైన పండుగ..
వసంత శోభతో పరిడవిల్లే నూతన వేడుక.. రంగుల కేళీ..
హోలీ పండుగ సందర్భంగా
మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.
హోలీ రంగుల కేళీ..
మీ జీవితంలో నిండాలి రంగోలీ..
ఆరోగ్యం.. ఐశ్వర్యాలతో వర్థిల్లాలి!
– మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు.
ఇంద్రధనస్సులోని రంగులన్నీ నేలకు దించేద్దాం..
ఈ హోలీని మరింత కలర్‌ఫుల్ చేసేద్దాం.
– మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.
రంగులన్నీ వేరుగా కనిపించవ్చు..
కానీ, అన్నీ కలిసి ఉంటేనే కంటికి ఇంపు
కుటుంబమైనా.. దేశమైనా ఇంతే..
విడివిడిగా కాదు.. కలివిడిగా కలిసి ఉందాం.
మన జీవితాలను రంగుల మయం చేసుకుందాం.
– మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు.
ఆ నింగిలోని హరివిల్లు మీ ఇంట విరియాలి
ఆ ఆనందపు రంగులు మీ జీవితంలో నిండాలి
– మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు.
అన్ని రంగులు ఉంటేనే ప్రకృతికి అందం
అన్ని మతాలు కలిసి ఉంటేనే దేశానికి అందం.. ఆనందం!
– మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు.
హోలీ నింపాలి మన జీవితాల్లో ఆనంద పరిమళం
తేవాలి సుఖాశాంతి సౌభాగ్యాలు!
– మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.
రంగుల పండుగ హోలీ
ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు,
సంబరాలు నింపాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు
– మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు.
హరివిల్లులోని రంగులన్నీ నేలకు దించేద్దాం..
అందరితో కలిసి ఆనందంగా ఆటలాడేద్దాం..
రసాయనాలు వద్దే వద్దు మనకొద్దు.. ప్రకృతిసిద్ధ రంగులే ముద్దు.
ఈ హోలీని సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..
– మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు.
హ్యాపీ హోలీ మెసెజెస్ (Happy Holi Messages)
హోలీ రోజున ఒకరికొకరు చల్లుకొనేవి రంగులు కావు. అనురాగ, అప్యాయతలు కలిసిన పన్నీటి రంగుల జల్లులు. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు.
ఈ హోలీ నాడు మీ కష్టాలన్నీ తొలగిపోవాలి. మీ జీవితం రంగులమయం కావాలి. హోలీ శుభాకాంక్షలు
రంగుల పండుగ వచ్చింది.. అందరింలో ఆనందాన్ని తెచ్చింది. హ్యాపీ హోలీ.
హోలీ పండుగను కలర్‌ఫుల్‌గా జరుపుకోవాలని కోరుకుంటూ.. మిత్రమా నీకు హోలీ శుభాకాంక్షలు
హోలీ అనేది రంగులు మాత్రమే కాదు. మన జీవితంలో ప్రతీ ఘట్టం కలర్‌ఫుల్‌గా ఉండాలనే సందేశం కూడా. హ్యాపీ హోలీ
ఈ రంగుల పండుగ మీకు మరింత అభివృద్ధి, సంపద, సుఖ సంతోషాలను తేవాలి… హోలీ శుభాకాంక్షలు
సుఖం, దుఃఖం, సంతోషాలకు ప్రతీకే ఈ రంగుల పండగ. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు.
ఈ సంవత్సరం మీకు రకరకాల రంగులతో అదృష్టం కలిసిరావాలి. ప్రతీక్షణం మీరు ఎంజాయ్ చెయ్యాలి. హ్యాపీ హోలీ 2024
ప్రతీ సీజన్‌లో కలర్స్ మారుతాయి. ప్రతీ రోజులో రంగులుంటాయి. జీవితం రంగులతో నిండిపోవాలి. హోలీ శుభాకాంక్షలు 2024
రంగురంగుల స్నేహాలు, కలర్‌ఫుల్ బంధుత్వాలు.. అందరికీ ఆనందాలు పంచే హోలీ సందర్భంగా శుభాకాంక్షలు
హ్యాపీ హోలీ ఇమేజస్ (Happy Holi Images)
హ్యాపీ హోలీ స్టేటస్ (Happy Holi Status)
Credits: Robin Agarwal
పైన మీకు అందించిన విషస్ లో మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని కుటుంబ సభ్యులకి, మీ మిత్రులకి మరియు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికి హోలీ శుభాకాంక్షలు.