Happy Republic Day 2024 Wishes, Quotes, Messages, Images and Status

Happy Republic Day 2024 Wishes, Quotes, Messages, Images, Status: భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న (శుక్రవారం) జరుపుకోనుంది. 1950లో మన దేశం తన రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించిన కీలక ఘట్టాన్ని ఈ రోజు సూచిస్తుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26, 1950న భారత ప్రభుత్వ చట్టం (1935)ని పాలక పత్రంగా భర్తీ చేస్తూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేస్తుంది. రాజ్యాంగాన్ని ఆమోదించడం ద్వారా దేశం బ్రిటీష్ పాలనలో ఉన్న దేశం నుండి సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా మారడాన్ని సూచిస్తుంది.

భారత రాజ్యాంగాన్ని రూపొందించడం అనేది డాక్టర్ BR అంబేద్కర్ నేతృత్వంలోని ఒక స్మారక పని, అందుకే ఆయనను “భారత రాజ్యాంగ పితామహుడు” అని పిలుస్తారు. రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం విలువలను కలిగి ఉంది. గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన రోజు జ్ఞాపకార్థం.

Happy Republic Day 2024 Wishes, Quotes, Messages, Images and Status

ఇది బ్రిటిష్ పాలన నుండి సార్వభౌమ దేశానికి మారడాన్ని సూచిస్తుంది. దాని చారిత్రక ప్రాముఖ్యతకు మించి, రిపబ్లిక్ డే అనేది స్వేచ్ఛ, హక్కులు మరియు విధులకు సంబంధించిన వేడుక. భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వంతో పాటు దాని సైనిక బలాన్ని ప్రపంచానికి ప్రదర్శించాల్సిన తరుణం కూడా ఇదే.

స్వాతంత్య్ర సమరయోధులు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న, స్వాతంత్యానికి పూర్వం నాటి చరిత్ర ఉంది. 1929లో లాహోర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో, పార్టీ పూర్ణ స్వరాజ్ లేదా సంపూర్ణ స్వాతంత్య్ర తీర్మానాన్ని తీసుకుంది. జనవరి 26, 1930ని సంపూర్ణ స్వాతంత్య్రం లేదా పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా పాటించాలని కాంగ్రెస్ ప్రకటించింది.

ఆ విధంగా, జనవరి 26, 1930న, మహాత్మా గాంధీ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ ‘పూర్ణ స్వరాజ్’ లేదా సంపూర్ణ స్వాతంత్య్రాన్ని ప్రకటించింది. ఈ ప్రకటన భారతదేశం యొక్క స్వీయ-నిర్ణయం కోసం అన్వేషణలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని గుర్తించింది మరియు ప్రజాస్వామ్యం మరియు సార్వభౌమాధికారం యొక్క సూత్రాల ద్వారా రూపొందించబడిన భవిష్యత్తు కోసం వేదికను ఏర్పాటు చేసింది.

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024 విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ (Happy Republic Day 2024 Wishes, Quotes, Messages, Status, Images)

 • గుండెల్లో దేశ భక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
 • మూడు రంగుల జెండా.. ముచ్చటైన జెండా.. భారతదేశ జెండా.. అందరికీ అండ.. నింగిలో ఎగిరి జెండా.. అందరూ మెచ్చే జెండా.. మనందరిలో ఆశలు రేపిన జెండా.. మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..
 • త్రివర్ణ పతాకం ఎల్లప్పుడు భారతదేశంలో ప్రతి ప్రతిచోటా రెపరెపలాడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి.. హ్యాపీ రిపబ్లిక్‌ డే
 • స్వాతంత్య్ర సమరయోధుల పోరాటం.. అమరవీరుల త్యాగఫలం.. ఆంగ్లేయులపై తిరుగులేని విజయం.. మన గణతంత్ర దినోత్సవం’ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే..
 • అమరవీరుల గుండెల్లో జ్వాల రగిలి.. దేశం కోసం వారి రక్తం ఏరులై ప్రవాహంచిన దృశ్యాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు. ఈ రోజు మనంతా కలిసి ఆ వీరులకు వందనం చేద్దాం.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
 • మీరు ఈ ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పు మీరే అవ్వండి.. నాయకుడిగా మార్గనిర్ధేశనం చేయండి. మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 
 • తెల్ల దొరలు చేస్తున్న ఆరాచకాలను చూసి.. మన వీరుల రక్తం ఉడికిపోయి ఉక్కులా బలంగా మారి స్వాతంత్ర కోసం పోరాడి ప్రాణాలు వదిలారు.. అలాంటి వారిని దేశం ఎప్పటికి మర్చిపోదు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
 • నేను భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నా.. ఎల్లప్పుడూ నేను భారతమాతకు రుణపడి ఉంటా.. భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారతమాతకు జేజేలు మీకు మీ కుటుంబసభ్యులకు, మిత్రులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..
 • ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కి ఇంత ప్రాముఖ్యత లభించడానికి ప్రతి ఒక్క పౌరుడు కారణమే.. ఇలానే భారత్‌ ప్రపంచ దేశాలతో పోటిపడి ముందుకు దుసుకెళ్లాలని కోరుకుందాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024
 • జాతులు వేరైనా, భాషలు వేరైనా… మనమంతా ఒక్కటే.. కులాలు వేరైనా, మతాలు వేరైనా… మనమంతా భారతీయులం.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
 • భారతమాత గౌరవం నిలబెడుతున్న ప్రతి యువకుడికి పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024.. భారత్ మాతా కీ జై
 • త్రివర్ణ పతాకం ఎల్లప్పుడు భారతదేశంలో ప్రతి ప్రతిచోటా రెపరెపలాడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి.. హ్యాపీ రిపబ్లిక్‌ డే
 • భారతదేశంలో పుట్టి, భారతమాత ఒడిలో చనిపోవడం మనందరి అదృష్టం..గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024 
 • న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం. మన గొప్ప భారత రాజ్యాంగ మూల స్తంభాలకు వందనం. మన త్రివర్ణ పతాకం ఎప్పుడూ ఎత్తుగా ఎగరాలి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
 • రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ప్రతి భారతీయుడు ప్రపంచవ్యాప్తంగా గర్వపడాలి. అప్పుడే అసలైన గణతంత్ర దినోత్సవం..
 • ఆంగ్లేయుల చెర నుంచి భారత్‌ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది. వారి త్యాగాలని గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా స్మరించుకుందాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
 • ప్రతి ఒక్కరూ ఇతర దేశాల్లో కూడా భారతీయుల్లా జీవించాలని కోరుకుంటూ..75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 
 • దేశభక్తితో మీ హృదయాన్ని నింపుకోవాల్సిన సమయం ఇది.
  అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మెసెజెస్ (Republic Day 2024 Wishes Messages)

సమరయోధుల పోరాట బలం..
అమర వీరుల త్యాగఫలం.
బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం..
స్మరిద్దాం.. గౌరవిద్దాం..
సగర్వంగా జరుపుకుందాం..
గణతంత్ర దినోత్సవం.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

జగతి సిగలో జాబిలమ్మకు వందనం..
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం..
మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి..
కలికి పదములు కడలి కడిగినర కళ ఇది.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మనం ఈ రోజు వేడుక జరుపుకోవడానికి
వారి ప్రాణాలను త్యాగం చేసిన వారికి
తల వంచి నమస్కరిస్తున్నాను.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా,
మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్యం,
సమానత్వం మరియు న్యాయం యొక్క విలువలను గౌరవిస్తామని
మరియు గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం.

మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ద్వారా ఐక్యత, స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్య స్ఫూర్తిని జరుపుకుందాం.
మన గొప్ప దేశాన్ని గౌరవిద్దాం మరియు మన హక్కులు మరియు స్వేచ్ఛలను నిర్ధారించే మన రాజ్యాంగం పట్ల గర్విద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

మాతృభూమి కోసం తమ ధన, మాన ప్రాణాలను..
త్యాగం చేసిన వారెందరో మహానుభావులు..
అందరికీ వందనములు.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా,
మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్యం,
సమానత్వం మరియు న్యాయం యొక్క విలువలను గౌరవిస్తామని
మరియు గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం.

మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం.
శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కోట్స్ (Republic Day 2024 Wishes Quotes)

“ఆలోచన తెచ్చుకోండి, దానికి కట్టుబడి ఉండండి, సవాళ్లను సహనంతో ఎదుర్కోండి, మీరు సూర్యోదయాన్ని చూస్తారు” – స్వామి వివేకానంద

“స్వరాజ్యం నా జన్మహక్కు. నేను దానిని పొందుతాను” – బాల గంగాధర్ తిలక్

కంటికి కన్ను సిద్ధాంతంతో ప్రపంచం మొత్తం అంధత్వంలో మునిగిపోతుంది “ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు ముందు మీలో రావాలి” – మహాత్మా గాంధీ

జీవితాన్ని ప్రేమిస్తాం.. మరణాన్నీ ప్రేమిస్తాం.. ఉరికంభాన్ని ఎగతాళి చేస్తాం.. నిప్పురవ్వలపై నిదురిస్తాం “ప్రజల అభీష్టాన్ని వ్యక్తీకరించినంత కాలం మాత్రమే చట్టం యొక్క పవిత్రత ఉంటుంది” – భగత్ సింగ్

మీ రక్తం మరగకపోతే.. అది నెత్తురు కాదు నీరు. మాతృభూమికి సేవ చేయకపోతే భారతీయుడివి కాదు – చంద్రశేఖర్ ఆజాద్ .

“గణతంత్రం వల్ల కలిగే ఆశ ఏంటి… ఒక దేశం, ఒక భాష, ఒక జాతీయ జెండా” – అలెగ్జాండర్ హెన్రీ

“ఈ దేశ సేవలో నేను మరణిస్తే, అది నాకు గర్వకారణమే. నా రక్తంలోని ప్రతి చుక్కూ దేశ అభివృద్ధికి ఉపయోగపడాలి. దేశాన్ని మరింత బలంగా, చురుగ్గా మార్చాలి” – ఇందిరా గాంధీ

స్వాతంత్య్రం వచ్చెననీ సంబరపడిపోతే సరిపోదోయి.. ఆగకోయి భారతీయుడా.. సాగవోయి ప్రగతి దారులా.. – శ్రీ శ్రీ

“ఆలోచన తెచ్చుకోండి, దానికి కట్టుబడి ఉండండి, సవాళ్లను సహనంతో ఎదుర్కోండి, మీరు సూర్యోదయాన్ని చూస్తారు” – స్వామి వివేకానంద

“ప్రతీ భారతీయ పౌరుడూ ఇప్పుడు తాను రాజ్ పుత్ లేదా సిక్కు లేదా జాట్ అనేది మర్చిపోవాలి. ప్రతి ఒక్కరూ తాము భారతీయులం అని భావించాలి” – సర్దార్ వల్లభాయ్ పటేల్

మహోన్నతమైన వారసత్వం మనది.. మహోజ్వలమైన చరిత్ర మనది.. భరత దేశంలో పుట్టినందుకు గర్వించు.. భారతీయుడిగా జీవిస్తున్నందుకు ఆనందించు.. – గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

“ఒక ఆలోచనను స్వీకరించండి, దానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి, సహనంతో పోరాడండి, సూర్యుడు మీ కోసం ఉదయిస్తాడు” – స్వామి వివేకానంద

“మనం కలిసి దక్షిణాసియాలో శాంతి, సామరస్యం, పురోగతి ప్రయాణాన్ని ప్రారంభిద్దాం” – అటల్ బిహారీ వాజ్‌పేయి

ప్రపంచం నిద్రపోతున్న వేళ భారతదేశం మేల్కొంటుంది.. రేపటి ఉషోదయం కోసం.. స్వేచ్ఛాస్వాతంత్య్రాల సంబరాలకోసం.. – గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

మనం శాంతిని నమ్ముతాం. శాంతియుత అభివృద్ధి మనకోసం మాత్రమే కాదు… ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోసమూ – లాల్ బహదూర్ శాస్త్రి

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇమేజస్(Happy Republic Day 2024 Images)

Happy Republic Day 2024 Wishes, Quotes, Messages, Images and Status

Happy Republic Day 2024 Wishes, Quotes, Messages, Images and Status

Happy Republic Day 2024 Wishes, Quotes, Messages, Images and Status

Happy Republic Day 2024 Wishes, Quotes, Messages, Images and Status

Happy Republic Day 2024 Wishes, Quotes, Messages, Images and Status

Happy Republic Day 2024 Wishes, Quotes, Messages, Images and Status

Happy Republic Day 2024 Wishes, Quotes, Messages, Images and Status

Happy Republic Day 2024 Wishes, Quotes, Messages, Images and Status

Happy Republic Day 2024 Wishes, Quotes, Messages, Images and Status

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్టేటస్ (Happy Republic Day 2024 Status)

Credit: RG Ringtone

పైన మీకు అందించిన గణతంత్ర దినోత్సవ విషస్, మెసెజస్, కోట్స్, ఇమేజస్, స్టేటస్ లలో మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *