Balli Sastram in Telugu For Female: బల్లి శాస్త్రం పురుషులకు స్త్రీలకు వేరువేరుగా ఉంటుంది. స్త్రీలకు అశుభాలు అయినవి పురుషులకు శుభాలు కావచ్చు. పురుషులకు శుభాలయినవి స్త్రీలకు అశుభాలు కావచ్చు. అయితే రాత్రి సమయంలో శరీరంపై బల్లి పడితే ఎలాంటి ఫలితం ఉండదని బల్లి శాస్త్రం చెబుతుంది. బల్లి వంటగదుల్లోనే ఎక్కువగా ఉంటుంది, స్ర్రీలు కూడా వంట గదుల్లోనే ఎక్కువగా ఉంటారు. కాబట్టి స్త్రీలపైనే బల్లి ఎక్కువగా పడే అవకాశం ఉంది. బల్లి స్త్రీలపై పడితే కలిగే శుభాలు, అశుభాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

స్త్రీల ఈ శరీర భాగాలపై పడితే శుభం, మంచిది
| స్త్రీల శరీర భాగం | శుభం |
| కుడికాలు | శత్రు నాశనం జరుగుతుంది |
| కాలి వేళ్లు | పుత్రుడు జన్మిస్తాడు |
| రొమ్ము లేక వక్షస్థలం | మంచి జరుగుతుంది |
| కుడి చెంప | మగ శిశువు జన్మిస్తాడు |
| కుడి చెవి | ధన లాభం, ఆదాయం |
| వేళ్లపై | నగల ప్రాప్తి |
| కుడి భుజం | కామ రాతి ప్రాప్తి కలుగుతుంది |
| భుజం | నగల ప్రాప్తి |
| తొడలు | కామము |
| మోకాళ్లు | ఆదరణ, అభిమానం, బంధము |
| చేతులపై | ధన లాభం |
| పిక్కల పై | బంధువుల రాక |
| ఎడమ కన్ను | మీ భర్తజదగ్గరైన వారి ప్రేమ పొందుతారు |
| కింది పెదవి | కొత్త వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి |
స్త్రీల ఈ భాగాలపై బల్లి పడితే అశుభం
| స్త్రీల శరీర భాగం | అశుభం |
| తలపై | మరణ భయం |
| కొప్పు పై | రోగాల భయం |
| కుడి కన్ను | మనోవ్యధ, అనవసరమైన టెన్షన్స్ |
| రెండు పెదవులపై | కష్టాలు, సమస్యలు ఫేస్ చేయాలి |
| వీపు పై | మరణవార్త వింటారు |
| గోళ్ల పై | చిన్న చిన్న కలహాలు, గొడవలు |
| ఎడమ చేయి | మెంటల్ స్ట్రైన్, అనవసరమైన ఒత్తిడి |
| చీలమండము | కష్టాలు |
| పై పెదవి | విరోధములు కలుగుతాయి |
స్త్రీలు తమ శరీరంపై బల్లి పడగానే భయబ్రాంతులకు గురికావద్దు. వెంటనే శుభ్రంగా తలస్నానం చేయాలి. ఆ తరువాత దేవుడి ముందు దీపం వెలిగించి ప్రార్ధించాలి. ఈ ఆర్టికల్ ని చదివి మీకు కలిగే ఫలితం గురించి తెలుసుకోవచ్చు. దోషం పెద్దదయితే కంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించి అందులోని బంగారు బల్లిని కూడా దర్శనం చేసుకోలి.