Kukkuta Sastram In Telugu: మనుషులకు జాతకం నక్షత్రాలు ఉన్నట్లే కోడి పుంజులకు కూడా జాతకాలు ఉంటాయి. ఈ కోడి జాతక శాస్త్రాన్నే కుక్కుట శాస్త్రం అంటారు. ఆంధ్రా ప్రాంతాల్లో సంక్రాంతి పండగ నాడు ఆడే కోళ్ల పందేల్లో ఈ కుక్కుట శాస్త్రం ప్రముఖ పాత్ర పోశిస్తుంది. కోడి పందేల్లో దిగే వారికి ఈ కుక్కుట శాస్త్రం బాగా ఉపయోగపడుతుంది. ఈ కుక్కుట శాస్త్రంలో ఏ కోడి పుంజుకు ఎప్పుడు మంచి జరుగుతుందోనని చాలా వివరంగా తెలియజేశారు.

కుక్కుట శాస్త్రం 2022 తెలుగులో ( Kukkuta Sastram 2022 In Telugu)

దేశంలో చాలా చోట్ల కొళ్ల పందేలు జరుగుతాయి. అయితే ఆంధ్ర ప్రాంతంలో గుంటూరు, గోదావరి జిల్లాల్లోనే ఈ కోళ్ల పందేలు ఎక్కువ జరుగుతాయి. ప్రతీ సంవత్సరం వేల కోట్లలో ఈ కోడి పందేలు జరుగుతాయి. కోడి పందెేలను ప్రభుత్వం బ్యాన్ చేసినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా యధా విధిగా కోళ్ల పందేలను నిర్వహిస్తుంటారు.

కోడి పుంజు రకాలు

కోడి పుంజుల్లో ఎన్నో రకాలుంటాయి. ఈ కల రంగులను బట్టి కోడి పుంజులను రకాలను విభజిస్తారు. మొత్తం 16 రకాల కోడి పుంజులు ఉన్నాయి. వాటి వివరాలను ఇలా ఉన్నాయి:

కోడిపుంజు రకంలక్షణాలు
కాకిఈ కోడిపుంజుకి నల్లని ఈకలుంటాయి
సేతుమొత్తం ఈకలు తెల్లగా ఉంటాయి
పర్లఈ పుంజుకు మెడపై నలుపు, తెలుపు రంగు ఈకలు సమానంగా ఉంటాయి
సవలమెడపై నల్లని ఈకలుంటాయి
కొక్కిరాయిఈ రకం పుంజు శరీరం నల్లగా ఉన్నా 2,3 రకాల ఈకలుంటాయి
డేగఈకలు మొత్తం ఎర్రగా ఉంటాయి
నెమలిఈ పుంజుకు రెక్కలపైన లేదా వీపుపైన పసుపు రంగు ఈకలుంటాయి
కౌజుమూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగులో ఈకలుంటాయి
మైలఈకలు ఎరుపు, బూడిద రంగులో ఉంటాయి
పూలఒక్కో ఈక నలుపు, తెలుపు, ఎరుపు రంగులో కలిసి ఉంటాయి
పింగళఎక్కువగా రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి, అక్కడక్కడా నలుపు, గోదుమ రంగులో ఉంటాయి
నల్లబోర
ఎర్రపొడ
ముంగిసముంగిస జూలు రంగులో ఈకలుటాయి
అబ్రాసుఈకలు లేత బంగారు రంగులో ఉంటాయి
గేరువాతెలుపు, లేత ఎరుపు రంగులో ఈకలుంటాయి.

కోళ్ల నక్షత్రాలు

మనుషులకు పన్నెండు జన్మ నక్షత్రాలు ఉన్నట్లే కోళ్లకు 27 జన్మ నక్షత్రాలు ఉంటాయి. ఆ 27 జన్మ నక్షత్రాలు, అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వాస, పుష్య, అశ్లేష, మాఘ, పుర్వ ఫాల్గుణి, పుబ్బ, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్టా, మూల, పూర్వాపాఢ, ఉత్తరాపాఢ, శ్రావణ, ధనిష్ట, శతభిష, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర, రేవతి

కోళ్ల పందేళ్లో జన్మ నక్షత్రం ప్రభావం

కోళ్ల పందేళ్లు జరిగినప్పుడు కోళ్ల జన్మనక్షత్రాలను బట్టి ఏ కోడి పై గెలుస్తుందో ఏ కోడిపై ఓడిపోతుందో కుక్కుట శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. గెలిచే, ఓడిపోయే టైమ్ ను కూడా కుక్కుట శాస్త్రంలో మెన్షన్ చేశారు. ఆ వివారాలు ఇవిగో:

నక్షత్రంగెలుపుఓటమి
అశ్వనినెమలిడేగ కోడి
కాకికోడి మీద
గౌడుపింగళి
భరణినల్ల సవనలనెమలి/ ఈటుక ఎరుపు కోడి మీద
పిచ్చుక రంగు గౌడునెమలి, ఎర్రపొడ
ఎర్రటి కాకికాకి
కృత్తికఎర్రకాకికాకి మీద
పిచ్చుక రంగు గౌడునెమలి, ఎర్రపొడ
రోహిణినెమలినల్ల మైల,
పింగళిఎర్రకోడి
కాకిఎర్రగౌడు, కోడి
మృగశిరకాకిడేగ
డేగపసుపు కాకి
పింగళికాకి
ఇటుకరంగు డేగముంగిస
కోడినెమలి, డేగ
ఆరుద్రడేగకాకి మీద
కాకిపింగళి, నల్లమైన, నెమలి, మీద
డేగపసిమి కాకి
కోడివెన్నెపోడ కోడి మీద
నల్లపొడ కోడిఎర్రపొడ కోడి, పిచ్చుక రంగు గౌడు
పునర్వాసకాకికోడి మీద
సుద్దకాకికోడి మీద
నెమలిడేగ
పిచ్చుక రంగు గౌడునల్లబోర, ఎర్రకోడి
పుష్యకాకికోడి మీద
పసిమి కాకినల్ల కాకి మీద
పింగళిడేగ, నెమలి మీద
కోడినెమలి మీద
కాకిపింగళి మీద గెలుపు
అశ్లేషనెమలిడేగ మీద
పింగళితుమ్మెద రంగు కాకి మీద
పసుపు రంగు కాకిడేగ మీద
కాకిపిచ్చుక రంగు కోడి మీద
ఎర్ర కోడినల్లబోర మీద గెలుపు
మాఘడేగనెమలి
కోడిపింగళి
పసుపు రంగు కాకిడేగ మీద
ఎరుపు నెమలినలుపు డేగ మీద
కోడిగోధుమ రంగు డేగ మీద గెలుపు
పుర్వ ఫాల్గుణి, పుబ్బకాకినెమలి, డేగ, కోడి మీద
నెమలిపింగళి, కోడి మీద
పింగళి3 డేగల మీద గెలుపు
ఉత్తర ఫల్గుణికోడినెమలి
కాకికోడి, డేగ, పింగళి
గోదుమ రంగు డేగనలుపు డేగ మీద గెలుపు
హస్తడేగనల్ల మైల మీద
పింగళినెమలి మీద
నెమలిఎర్రపొడ కోడి మీద
డేగపింగళి
పసుపు రంగు కోడినెమలి
చిత్తకోడిడేగ మీద
నెమలికాకి, ఎర్రపొడి కోడి మీద
ఎర్రపొడి కోడిపిచ్చుక రంగు గౌడు మీద
కాకికోడి మీద గెలుపు
స్వాతినెమలిడేగ మీద,
నల్ల డేగతెల్ల డేగ మీద
పింగళిఎర్ర గౌడు, శుద్ధ కాకి మీద
పసుపు రంగు కాకినలుపు పొడ కోడి మీద
పసుపు రంగు కోడిశుద్ధ కాకి
విశాఖకోడినెమలి, డేగ, పింగళి, కాకి
పసుపు రంగు కోడిడేగ మీద
ఎరుపు రంగు గౌడుశుద్ధ మైల
ఎరుపు రంగు నెమలిపింగళి
అనూరాధకాకినెమలి, నల్ల మైల మీద
నెమలికోడి మీద గెలుపు
జ్యేష్టాపింగళికోడి, డేగ మీద
పిచ్చుక రంగు గౌడుడేగ మీద
పసుపు రంగు కాకిశుద్ధ కాకి మీద
ఇటుక రంగు పింగళినెమలి, కోడి
మూలకాకి గోధుమ రంగు డేగ
నెమలి రంగు గౌడునల్లపొడ కోడి, నలుపు రంగు కాకి
నలుపు రంగు కాకిపసుపు రంగు కాకి
నల్ల సవలకోడి
పూర్వాషాఢడేగనెమలి
పసుపు రంగు కాకితుమ్మెద రంగు కాకి
ఉత్తరాషాఢడేగకాకి
నెమలి రంగు గౌడునల్ల మెడ గల ఎర్ర కోడి
శ్రావణగోధుమ రంగు డేగకాకి
కోడికాకి, డేగ, పింగళి మీద
 తెలుపు నెమలినల్ల నెమలి
ధనిష్టనెమలి వన్నె కాకిఎరుపు రంగు కాకి, కోడి మీద
 కోడిపసుపు రంగు డేగ, నల్లపొడ కోడి
శతభిషపసుపు రంగు డేగనల్లపొడ కోడి
కోడికాకి
తెలుపు రంగు నెమలిశుద్ధ డేగ, శుద్ధ కాకి
పూర్వాభద్రకోడినెమలి, పసుపు రంగు కాకి
ఉత్తరాభద్రనెమలికోడి, కాకి
పింగళినెమలి, కాకి
డేగనెమలి, కాకి
రేవతిపింగళి వన్నె గౌడుకోడి మీద
కోడిడేగ మీద
కాకిడేగ , పింగళి మీద
పసుపు రంగు కోడిడేగ, పింగళి మీద
నెమలిడేగ, కోడి

కోళ్లను పందెం జరిగే సమయంలో వదిలే దిశను బట్టి కూడా గెలుపోటములు నిర్ణయించబడతాయి. కుక్కుట శాస్త్రంలోని నియమాలు అన్ని పాటిస్తే ఆ కోడి పుంజు ఖచ్చితంగా గెలిచి తీరుతుంది.

  • ఆదివారం, శువ్రవారం – ఉత్తర దిశలో
  • సోమవారం, శనివారం – దక్షిణ దిశలో
  • మంగళవారం – తూర్పు దిశలో
  • బుధవారం, గురువారం – పడమర దిశలో

పందెం కోళ్ల పెంపకం

ప్రతీ సంవత్సరం కొన్ని వేల కోట్లలో ఈ కోళ్ల పందేలు జరుగుతాయి. వీటి పెంపకాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు. వీటికి ఆహారంగా మామూలు ధాన్యం కాకుండా పిస్తా, కాజు, బాదాం, కీమా లాంటివి వాటిని ఆహారంగా ఇస్తారు. పవర్ఫుల్ మద్యాన్ని కూడా వీటికి అందిస్తారు. ఒక్క పందెం కోడి పుంజు లక్షల్లో పలుకుతుంది. కొందరు సంవత్సరం తరబడి కోళ్లపందేలు నిర్వహిస్తారు.

కుక్కుట శాస్త్రం పీడీఎష్ బుక్ ( Kukkuta Sastram PDF Book)

కుక్కుట శాస్త్రం పూర్తి వివరాలను పీడీఎఫ్ రూపంలో అందుబాటు ఉంటాయి. కుక్కుట శాస్త్రాన్ని బాగా అవపోసన పడితే కోళ్ల పందేల పై మంచి పట్టు సాధించవచ్చు. కుక్కుట శాస్త్రం వ్యాపారం కోట్లలో ఉంటుంది. ఏ సమయానికి, ఏ రోజుకు, ఏ కోడి గెలువనుందో కుక్కుట శాస్త్రం చదివిన వారికి మంచి అవగాహణ ఉంటుంది. అమెజాన్ ఆన్లైన్ స్టోర్ లో రూ. 340కు ” రహస్య కుక్కుట శాస్త్రం” అనే పుస్తకం అందుబాటులో ఉంది. లొల్లా రామచంద్రరావు దీన్ని రచించారు. ఇప్పుడే ఈ బుక్ ను ఆర్డర్ చేసుకొని వెంటనే కుక్కుట శాస్త్రంపై పట్టు పెంచుకోండి.

కుక్కుట శాస్త్రం యాప్

కుక్కుట శాస్తం, కోళ్ల పందేల కు సంబంధించిన ప్రత్యేక యాప్ మీకు గూగుల ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. “SGS MTM Education” సంస్థవారు ఈ కుక్కుట శాస్త్రం యాప్ ను రూపొందించారు. కేవలం 11 ఎమ్బీ సైజులో ఉన్న ఈ యాప్ ను మీరు కొంత పే చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కుక్కుట శాస్త్రం విన్నింగ్ కలర్స్

కోళ్ల జాతకం బట్టి ఒక్కో రోజు ఒక్కో రంగు కోడిపుంజు విజయం సాధిస్తుంది. ప్రస్తుతానికి మొత్తం 16 కోడి పుంజు రకాలున్నాయి. వీటిలో ఏ రంగు కోళ్లు ఏ రోజు విజయం సాధిస్తుందోనని మీరు ఇంటర్నెట్ లో ఈజీగా తెలుసుకోవచ్చు. వాటి వివరాలను మా ఈ సైట్లో ఎప్పటికప్పడు అపలోడ్ చేస్తాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *