Balli Sastram: బల్లి అంటే అందరికీ వికారం కలుగుతుంది. ప్రతీ ఒక్కరి ఇంట్లో బల్లి ఉంటుంది. ఎప్పోడో ఒకప్పుడు ప్రతీ ఒక్కరి మీద బల్లి పడి ఉంటుంది. బల్లి పడ్డ చోటుని బట్టి శుభమా అశుభమా అని మన పెద్దలు చెబుతుంటారు. దీనినే గౌలి పఠన శాస్త్రం. బల్లి ఎక్కడ పడితే ఏమి జరుగుతుందనేది గోలి పఠన శాస్త్రంలో చాలా వివరంగా ఉంది. అయితే బల్లి శరీరంపై పడితే.. వాటి ఫలితాలు.. పురుషులకు స్త్రీలకు వేరువేరుగా ఉంటుంది. వాటి పూర్తి వివరాలను మనము ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
బల్లి శాస్త్రం, గౌలి పఠన శాస్త్రం
వేదాల్లో అన్నీ ఉంటాయట అనే సామెత వినే ఉంటారు. బల్లి గురించి కూడా ఉంది. దాన్నే గౌలి పఠన శాస్త్రం అంటారు. బల్లి చూడడానికి చాలా అసహ్యంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మనకు శుభం కలిగిస్తుంది. బల్లి శరీరంపై ఎక్కడ పడితే శుభం కలుగుతుంది, ధన ప్రాప్తి కలుగుతుంది లాంటి విషయాలను మనము ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
పురుషులు, స్త్రీలపై వేరువేరు ప్రభావం
పురుషులు, స్త్రీలపై బల్లి పడితే కలిగే ప్రభావం వేరు వేరుగా ఉంటుంది. స్త్రీలు ఎక్కువగా వంటగదుల్లో ఉంటారు, బల్లి కూడా వంట గదిలోనే ఉంటుంది. కాబట్టి బల్లి స్త్రీల మీదే ఎక్కువ పడే అవకాశం ఉంది.
బల్లి శాస్త్రం ప్రకారం పురుషులకు కలిగే శుభాలు
పురుశుల శరీర భాగం | శుభం |
మణికట్టు | అలంకార ప్రాప్తి కలుగుతుంది |
వ్రేళ్ల పై | అనుకోకుండా బంధువ, స్నేహితుల రాక |
పాదముల పై | ప్రయాణానికి సిద్ధం |
ముఖంపై | ఆర్దిక సమస్యలు తొలగి, లాభాల బాట పడతారు |
ఎడమ కన్ను | అంతా శుభమే జరుగుతుంది |
ఎడమ చెవి | ఆదాయం బాగా వస్తుంది, లాభము |
కింది పెదవి | ఆదాయంలో లాభం కలుగుతుంది |
వీపు పై ఎడమ భాగం | విజయం కలుగుతుంది |
బల్లి శాస్త్రం ప్రకారం పురుషులకు కలిగే అశుభాలు
పురుశుల శరీర భాగం | అశుభం |
వీపు పై కుడి వైపు | రాజ భయం |
మోచేయి | డబ్బు నష్టం |
కుడి భుజం | కష్టాలు, సమస్యలు |
ఎడమ భుజం | పదిమందిలో అగౌరవం జరుగుతుంది |
తొడలు | దుస్తులు, వస్త్రాలు నాశనం అవుతాయి |
మీసాలపై | కష్టాలు వెంటాడతాయి |
కాలి వేళ్లపై | అనారోగ్య సమస్యలు |
తలపై భాగాన | మరణం వెంటాడుతున్నట్లు |
కుడి కన్ను | చేసిన పని విజయవంతం కాదు, అపజయం కలుగుతుంది |
నుదురు పై | ఇతర సమస్యలతో చిక్కుకోవడం, విడిపోవడం |
కుడి చెంప | బాధపడటం |
పై పెదవి | కలహాలు వంటపడుతాయి |
రెండు పెదవుల మధ్య | మృత్యువు సంభవిస్తుంది |
బల్లి శాస్త్రం ప్రకారం స్త్రీలకు కలిగే శుభాలు
స్త్రీల శరీర భాగం | శుభం |
కుడికాలు | శత్రు నాశనం జరుగుతుంది |
కాలి వేళ్లు | పుత్రుడు జన్మిస్తాడు |
రొమ్ము లేక వక్షస్థలం | మంచి జరుగుతుంది |
కుడి చెంప | మగ శిశువు జన్మిస్తాడు |
కుడి చెవి | ధన లాభం, ఆదాయం |
వేళ్లపై | నగల ప్రాప్తి |
కుడి భుజం | కామ రాతి ప్రాప్తి కలుగుతుంది |
భుజం | నగల ప్రాప్తి |
తొడలు | కామము |
మోకాళ్లు | ఆదరణ, అభిమానం, బంధము |
చేతులపై | ధన లాభం |
పిక్కల పై | బంధువుల రాక |
ఎడమ కన్ను | మీ భర్తజదగ్గరైన వారి ప్రేమ పొందుతారు |
కింది పెదవి | కొత్త వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి |
బల్లి శాస్త్రం ప్రకారం స్త్రీలకు కలిగే అశుభాలు
స్త్రీల శరీర భాగం | అశుభం |
తలపై | మరణ భయం |
కొప్పు పై | రోగాల భయం |
కుడి కన్ను | మనోవ్యధ, అనవసరమైన టెన్షన్స్ |
రెండు పెదవులపై | కష్టాలు, సమస్యలు ఫేస్ చేయాలి |
వీపు పై | మరణవార్త వింటారు |
గోళ్ల పై | చిన్న చిన్న కలహాలు, గొడవలు |
ఎడమ చేయి | మెంటల్ స్ట్రైన్, అనవసరమైన ఒత్తిడి |
చీలమండము | కష్టాలు |
పై పెదవి | విరోధములు కలుగుతాయి |
బల్లి దోశం తొలగాలంటే?
గౌలి పఠన శాస్త్రం ప్రకారం ఎంత పెద్ద దోశం అయినా సరే తొలగించవచ్చు అయితే దోశం తొలగాలంటే తమిళనాడులోని కంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించాల్సిందే. ఆ ఆలయంలో బంగారు బల్లి ఉంటుంది. ఆ బంగారు బల్లిని దర్శనం చేసుకొని తాగితే దోశం తొలగిపోతుంది. ఒక వేళ కంచి కామాక్ష అమ్మవారి ఆలయానికి వెళ్లలేకపోతే ఆ ఆలయానికి వెళ్లిన వారి పాదాలకు నమ్మస్కరించినా సరే దోశం తొలగిపోతుంది.
బల్లి మీద పడగానే ఏమి చేయాలి?
బల్లి మీద పడగానే భయబ్రాంతులకు గురికావద్దు. బల్లి కేవలం ఓ చిన్ని జంతువు మాత్రమతే. అది మనల్ని ఏమి చేయలేదు, కనీసం కొరకను కూడా లేదు కాబట్టి బల్లి మీద పడితే భయపడాల్సిన అవసరం లేదు. కానీ బల్లి మీద పడ్డ వెంటనే శుభ్రంగా స్నానం చేసుకోవాలి. తరువాత దీపం వెలిగించి దేవుడికి నమస్కరించాలి.
FAQ
-
బల్లి మీద పడగానే ఏమి చేయాలి?
ఆందోళన చెందకుండా ముందు శుభ్రంగా స్నానం చేసి ఆతరువాత దేవుడి ముందు దీపం వెలిగించి నమస్కరించాలి. పైనున్న ఆర్టికల్ ను చదివితే మీకు కలిగే ఫలితం గురించి తెలుసుకోవచ్చు.
2. బల్లి మీద పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి?
బల్లి మీద పడితే శుభం అశుభం రెండు జరగవచ్చు. అది బల్లి పడ్డ శరీర భాగం పై ఆధారపడి ఉంటుంది.
3. స్త్రీ తలపై బల్లి పడితే ఏమి జరుగుతుంది?
స్ర్రీల తలపై బల్లి పడితే మరణ భయం వెంటాడుతుంది.
4. స్ర్రీల వీపు పై బల్లి పడితే ఏమి జరుగుతుంది?
స్రీల వీపుపై బల్లి పడితే మరణవార్త వింటారు.