Balli Sastram in Telugu For Male: పురుషులకు స్త్రీలకు బల్లి శాస్త్రం వేరు వేరుగా ఉన్న విషయం తెలిసిందే. పురుషులపై బల్లి పడే అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే వారు ఎప్పుడూ ఇంటి బయటనే ఉంటారు కాబట్టి. బల్లులు ఎక్కువగా వంటగది స్టోర్ రూంలలో ఎక్కువగా ఉంటుంది. పురుషులు అక్కడ ఉండరు కాబట్టి వారిపై బల్లి పడే అవకాశాలు తక్కువఅయినప్పటికీ, బల్లి పడితే కలిగే శుభాలు, అశుభాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
పురుషులపై బల్లి పడితే కలిగే శుభాలు
పురుశుల శరీర భాగం | శుభం |
మణికట్టు | అలంకార ప్రాప్తి కలుగుతుంది |
వ్రేళ్ల పై | అనుకోకుండా బంధువ, స్నేహితుల రాక |
పాదముల పై | ప్రయాణానికి సిద్ధం |
ముఖంపై | ఆర్దిక సమస్యలు తొలగి, లాభాల బాట పడతారు |
ఎడమ కన్ను | అంతా శుభమే జరుగుతుంది |
ఎడమ చెవి | ఆదాయం బాగా వస్తుంది, లాభము |
కింది పెదవి | ఆదాయంలో లాభం కలుగుతుంది |
వీపు పై ఎడమ భాగం | విజయం కలుగుతుంది |
పురుషులపై బల్లి పడితే కలిగే అశుభాలు
పురుశుల శరీర భాగం | అశుభం |
వీపు పై కుడి వైపు | రాజ భయం |
మోచేయి | డబ్బు నష్టం |
కుడి భుజం | కష్టాలు, సమస్యలు |
ఎడమ భుజం | పదిమందిలో అగౌరవం జరుగుతుంది |
తొడలు | దుస్తులు, వస్త్రాలు నాశనం అవుతాయి |
మీసాలపై | కష్టాలు వెంటాడతాయి |
కాలి వేళ్లపై | అనారోగ్య సమస్యలు |
తలపై భాగాన | మరణం వెంటాడుతున్నట్లు |
కుడి కన్ను | చేసిన పని విజయవంతం కాదు, అపజయం కలుగుతుంది |
నుదురు పై | ఇతర సమస్యలతో చిక్కుకోవడం, విడిపోవడం |
కుడి చెంప | బాధపడటం |
పై పెదవి | కలహాలు వంటపడుతాయి |
రెండు పెదవుల మధ్య | మృత్యువు సంభవిస్తుంది |
పురుషులపై బల్లి పడగానే వెంటనే శుభ్రంగా తల స్నానం చేయాలి. ఎంత పెద్ద దోశం అయినప్పటికీ దాన్ని తొలగించవచ్చు కాబట్టి ధైర్యంగా ఉండుండి. స్నానం చేసిన తరువాత దేవుడి ముందు దీపం వెలిగించి ప్రార్థించండి. మీ శరీరంపై ఎక్కడ బల్లి పడిందో దానిని బట్టి ఈ ఆర్టికల్ చదివి మీకు కలిగే శుభం అశుభం గురించి తెలుసుకోండి. దోషం పెద్దదయితే కంచి కామాక్షి దేవాలయంలోని బంగారు బల్లి దర్శనం చేసుకోండి. లేదంటే ఆ బంగారు బల్లి దర్శనం చేసుకున్న వారి కాళ్లకు నమస్కారం చేస్తే దోశం తొలగిపోెతుంది.