Happy Ganesh Chaturthi Wishes 2023, Images, Quotes, GIF, Greetings, Messages, Status: గణేష్ చతుర్థి అనేది హిందువుల పండుగ, ఇది శ్రేయస్సు మరియు జ్ఞానాన్ని అందించే ఏనుగు-తల దేవుడు గణేశ భగవానుని పునర్జన్మను జరుపుకుంటుంది. ఈ పండుగ హిందూ చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసంలోని నాల్గవ రోజున జరుపుకుంటారు మరియు సాధారణంగా ఆంగ్ల క్యాలెండర్‌లో ఆగస్టు మరియు సెప్టెంబర్ మధ్య వస్తుంది. భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో ఇది సెలవుదినం మరియు 2023 సంవత్సరానికి గణేష్ చతుర్థి సెలవుదినం సెప్టెంబర్ 18న జరుగుతుందని భావిస్తున్నారు. గణేష్ చతుర్థి 2023 వేడుకలు మరియు ఆచారాల గురించి తెలుసుకోవడానికి చదవండి.
ఇది శివుడు మరియు పార్వతి దేవి కుమారుడు గణేశుడికి అంకితం చేయబడిన హిందువుల మతపరమైన పండుగ. ఈ పండుగ వేడుకలు 10 రోజుల పాటు నిర్వహించబడతాయి మరియు ఈ సమయంలో గణేశుడు తన తల్లి, పార్వతీ దేవితో భూమిపైకి వస్తాడని మరియు ప్రజలపై తన ఆశీర్వాదాలను కురిపిస్తాడని నమ్ముతారు. గణేశుడి విగ్రహాలను ఇళ్ళలో, దేవాలయాలలో, పదిరోజుల పాటు పూజిస్తారు. పదవ రోజు, విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు, ఇది పండుగ ముగింపును సూచిస్తుంది. గణేష్ చతుర్థి 2023కి సంబంధించిన ముఖ్యమైన వివరాలను అంటే అది ఎప్పుడు జరుపుకుంటారు, ఎలా జరుపుకోవాలి, ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మొదలైన వాటిని ఈ కథనంలో చూడవచ్చు.
Ganesh Chaturthi 2023 Date: గణేష్ చతుర్థి 2023 తేదీ
హిందూ పురాణాల ప్రకారం, హిందూ క్యాలెండర్‌లో భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో గణేశుడి పుట్టుక సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్‌లో ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో వస్తుంది. ఈ సంవత్సరం, గణేష్ చతుర్థి వేడుకలు సెప్టెంబర్ 18, 2023 సోమవారం నాడు జరుగుతాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం, వినాయక చవితి 2023 సెప్టెంబర్ 18, సోమవారం మధ్యాహ్నం 12:39 గంటలకు ప్రారంభమవుతుంది మరియు సెప్టెంబర్ 19, మంగళవారం రాత్రి 8:43 గంటలకు ముగుస్తుంది. అదనంగా, మధ్యాహ్న గణేశ పూజ ముహూర్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇది 11:01 AMకి ప్రారంభమవుతుంది మరియు 01:28 PM వరకు పొడిగించబడుతుంది, ఇది 2 గంటల 27 నిమిషాల వ్యవధిని కలిగి ఉంటుంది. గణేశ చతుర్థికి ఒక రోజు ముందు చంద్రుని దర్శనం నుండి దూరంగా ఉండటానికి, 09:45 AM నుండి 08:44 PM వరకు చంద్రుని దర్శనానికి దూరంగా ఉండాలని సిఫార్సు చేయబడింది.
గణేష్ చతుర్థి విషెస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ (Ganesh Chaturthi Wishes, Quotes, Messages, Status, Images)
‘వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా’ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
కొత్త సూర్యోదయం, కొత్త ప్రారంభం, దివ్య గణేశుడి ఆశీస్సులతో మన రోజును ప్రారంభిద్దాం. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
ఆ బొజ్జ గణపతి మీ ప్రార్థనలన్నింటినీ విని మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ… గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
గణపతి బప్పా మోరియా. వినాయకుడు మీకు జ్ఞానం, తెలివి, శ్రేయస్సు, ఆనందం, విజయాన్ని అందిచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డూ ఎంత తియ్యగా ఉంటుందో, అంతే తియ్యగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
మన హృదయాలలో వినాయకుడు ఉంటే.. జీవితంలో దేని గురించి చింతించాల్సిన పని లేదు. మీకు, మీ ప్రియమైన వారికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
బొజ్జ గణపయ్య మీ ఇంటికి వచ్చి మీరు పెట్టిన లడ్డూలు, కుడుములతో పాటు మీకున్న ఇబ్బందులను కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
గణేశుడు మన జీవితాలను ప్రకాశవంతం చేస్తూ ఎల్లప్పుడూ ప్రేమ, విజయాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
మీకు మీ కుటుంబసభ్యులకు అందమైన, ఉల్లాసమైన వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భం మీకు మరెన్నో చిరునవ్వులు, వేడుకలను తీసుకురావాలని కోరుకుంటున్నాను.
విఘ్నాధిపతి మీకు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు అందించాలని, సుఖసంతోషాలు మీ ఇంట్లో కొలువుండేలా చూడాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
మీకు ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు కలగాలని గణేశుడిని ప్రార్థిస్తున్నాను. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
మీకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు. గణేశుడి అనుగ్రహం మీ జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది.
విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో విఘ్నాలన్నీ తొలగి మీకు శుభములు చేకూరాలని మనసారా కోరుకుంటూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
ఈ వినాయక చవితి మన దుఃఖాలన్నింటినీ పోగొట్టి.. మన సంతోషాన్ని పెంచి.. మనందరికీ ఆయన అనుగ్రహాన్ని ప్రసాదించాలని నేను గణేశుడిని ప్రార్థిస్తున్నాను. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
గణేష్ చతుర్థి కోట్స్ (Ganesh Chaturthi Quotes)
బొజ్జ గణపయ్య మీ కోరిన కోరికలన్నింటినీ
నెరవేర్చి, మీకు సకల విజయాలను అందించాలని కోరుకుంటున్నా.
మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
ఆ లంబోదరుడు మీ కన్నీళ్లను నవ్వులుగా
మీ కష్టాలను విజయాలుగా మార్చాలని,
కారుమబ్బులు కమ్మిన జీవితాల్లో
ఇంద్రధనుసులు విరిసేలా చేయాలని కోరుకుంటూ..
మీకు వినాయక చవితి శుభాకాంక్షలు
సకల విఘ్నాలు తొలగించే ఆ గణేశుడి ఆశీస్సులు
మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ…
మీ కుటుంబసభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
ఆ విఘ్నేశ్వరుడు మీరు చేపట్టిన పనులన్నీ
విజయవంతం చేయాలని, మీ ఇంట్లో సుఖసంతోషాలు
వెల్లివిరియాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
హ్యాపీ వినాయక చతుర్ధి.
ఏకదంతం మహాకాయం
తప్తకాంచనసన్నిభమ్
లంబోదరం విశాలాక్షం
వందేహం గణనాయకమ్
హ్యాపీ వినాయక చతుర్థి
అగజానన పద్మార్కం
గజాననమ్ అహర్నిశం
అనేకదంతం భక్తానాం
ఏకదంతమ్ ఉపాస్మమే
వినాయక చవితి శుభాకాంక్షలు
ఓం వక్రతుండ మహాకాయ
కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ
సర్వకార్యేషు సర్వదా
వినాయక చవితి శుభాకాంక్షలు
శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయే
త్సర్వ విఘ్నోప శాంతయే
మీకు మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు
ఆదిపూజ్యుడికి అభివందనం..
పార్వతీనందనుడికి ప్రియవందనం..
ముల్లోకాలను ఏలే మూషికా వాహనుడికి మనసే మందిరం
విఘ్నాలను తొలగించే వినాయకుడికి
అఖండ భక్తకోటి అందించే అపూర్వ నీరాజనం
ఓ విఘ్నేశ్వరాయ నమ:
గణేష్ చతుర్థి మెసెజెస్ (Ganesh Chaturthi Messages)
పార్వతీపరమేశ్వర తనయ బొజ్జగణపయ్య అందరికీ విజయాలు అందించాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు
లంబోదరుడు కరోనా వంటి కష్టాల నుండి గట్టెక్కించాలని, మీ జీవితాన్ని ఆనందంతో నింపాలని కోరుకుంటూ.. వినాయక చవితి శుభాకాంక్షలు.
సకల విఘ్నాలూ తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు
లంబోదరుడు మీ కన్నీళ్లను నవ్వులుగా, మీ కష్టాలను సంతోషంగా, కారుమబ్బులను హరివిల్లులగా మార్చాలని కోరుకుంటూ.. హ్యాపీ వినాయక చవితి.
చేసే పనులన్నీ ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయవంతం కావాలి. ఈ పండుగ మీకు సరికొత్త కాంతులు తేవాలి. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
మీ జీవితంలోని విఘ్నాలన్నింటినీ తొలగించి మిమ్మల్ని ఎల్లవేళలా ఆనందంగా ఉండేలా చూడాలని కోరుకుంటూ… వినాయక చవితి శుభాకాంక్షలు..
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే.. వినాయక చవితి శుభాకాంక్షలు
కష్టాలు తొలగిపోయే రోజులు రావాలి. ఆ గణపయ్య మీ ఇంట అష్టైశ్వర్యాలూ, ఆయురారోగ్యాలు కలిగించాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు
మీరు ఏ పని మొదలుపెట్టినా.. ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలని.. ఆ లంబోదరుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ.. వినాయక చవితి శుభాకాంక్షలు..
లంబోదరుడు మిమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించాలి. మీ జీవితాల్లో ఆనంద వెలుగులు నింపాలి. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో విఘ్నాలన్నీ తొలగి మీకు శుభములు చేకూరాలని మనసారా కోరుకుంటూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఇమేజస్ (Ganesh Chaturthi Images)
గణేష్ చతుర్థి స్టేటస్ ( Happy Ganesh Chaturthi Wishes Status)
మీరు ఒకవేళ బెస్ట్ గణేష్ చతుర్థి విషెస్ స్టేటస్ గురించి వెతుకుకుతున్నారా. అయితే మీకు శ్రమ తగ్గించడానికి మేము బెస్ట్ గణేష్ చతుర్థివిషెస్ స్టేటస్ కొన్ని కింద ఉంచాము. మీకు నచ్చినవాటిని సెలెక్ట్ చేసుకుని, మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకు పంపించండి.
Credit: Om Vishnu Dev
Credits: VENKY EDITS OFFICIAL
పైన మేము బెస్ట్ గణేష్ చతుర్థి విషస్, మెసెజస్, కోట్స్, ఇమేజస్, స్టేటస్లు మీ ముందు ఉంచాం, నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని మీ కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.